iDreamPost

పవన్ లో కొత్త ఆశ! చంద్రబాబుకే వెన్నుపోటు పడబోతుందా?

  • Published Oct 21, 2023 | 2:44 PMUpdated Oct 21, 2023 | 2:44 PM

సాధారణంగా ఏపీ రాజకీయాల్లో వెన్నుపోటు అనగానే చంద్రబాబు పేరు చెబుతారు వైసీపీ శ్రేణులు. అయితే త్వరలోనే ఆ జాబితాలో పవన్‌ కళ్యాణ్‌ కూడా చేరతారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇంతకు ఏం జరిగింది అంటే..

సాధారణంగా ఏపీ రాజకీయాల్లో వెన్నుపోటు అనగానే చంద్రబాబు పేరు చెబుతారు వైసీపీ శ్రేణులు. అయితే త్వరలోనే ఆ జాబితాలో పవన్‌ కళ్యాణ్‌ కూడా చేరతారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇంతకు ఏం జరిగింది అంటే..

  • Published Oct 21, 2023 | 2:44 PMUpdated Oct 21, 2023 | 2:44 PM
పవన్ లో కొత్త ఆశ! చంద్రబాబుకే వెన్నుపోటు పడబోతుందా?

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తీరుపై టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌.. బాబుకి వెన్నపోటు పొడవాలని చూస్తున్నారా ఏంటి అనే చర్చ సాగుతోంది. ఇంతకు ఈ టాపిక్‌ ఎందుకు వచ్చిందంటే.. నిన్న అనగా అక్టోబర్‌ 20 శుక్రవారం నాడు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌.. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. టీడీపీతో కలిసి వెళుతున్నామని తెలిపిన పవన్‌ కళ్యాణ్‌ సీఎం సీటు గురించి ఆస​క్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ సీఎం పదవి వద్దని చెప్పలేదంటూ తన మనసులోని కోరిక బయట పెట్టారు పవన్‌ కళ్యాణ్‌. అయితే పదవి కోసం తాను వెంపర్లాడనని.. కాకపోతే సీఎంగా అవకాశం ఇస్తే తప్పకుండా తీసుకుంటానని పవన్‌ స్పష్టం చేశారు.

పవన్‌ వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. నిన్నటి సమావేశం అనే కాదు.. గత కొంత కాలంగా సందర్భం వచ్చిన ప్రతి సారి పవన్‌ తన మనసులోని కోరికను బయట పెడుతూ వస్తున్నారు. అవకాశం వస్తే.. తాను తప్పకుండా సీఎం అవుతానని మనసులోని కోరికను బయట పెడుతున్నారు. అయితే ఇన్నాళ్లు పవన్‌ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోని టీడీపీ మాత్రం.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో.. జనసేన అధ్యక్షుడి మాటలను సీరియస్‌గా తీసుకుంటుంది అంటున్నారు విమర్శకులు. రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని.. గత ఏడాది నుంచే జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా బాబు అరెస్ట్‌ తర్వాత పొత్తు కన్ఫామ్‌ అంటూ క్లారిటీ ఇచ్చారు పవన్‌ కళ్యాణ్‌.

బాబు అరెస్ట్‌ కాకపోయి ఉంటే సీన్‌ వేరు..

చంద్రబాబు బయట ఉంటే.. పవన్‌ కళ్యాణ్‌ సీఎం ఆశలు ఎన్నిటికి తీరేవి కావు. తాను లేదంటే.. తన కుమారుడు మాత్రమే పార్టీలో హైలెట్‌ కావాలి.. సీఎం క్యాండెట్‌ అంటే తమ ఇద్దరి పేర్లే మాత్రమే రావాలి అన్నది చంద్రబాబు అభిమతం. అందుకే పార్టీలో సెకండ్‌ కేడర్‌ లీడర్‌ ఎవ్వరిని ఎదగనివ్వలేదు. ఆఖరికి కుటుంబం నుంచి పోటీ వస్తారని భావించి.. వారిని కూడా దూరంగా పెట్టారు. అలాంటిది ఇక పవన్‌ కళ్యాణ్‌కి సీఎం కుర్చీ దక్కనివ్వడం అంటే ఎండమావిలో నీటి కోసం వెతకడం లాంటిదే అవుతుందనే అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు.. పవన్‌ని సీఎం కుర్చీ దరిదాపుల్లోకి కూడా రానివ్వడనేది.. జగనమెరిగిన సత్యం అంటున్నారు విశ్లేషకులు.

ఇప్పుడు రివర్స్‌ సీన్‌..

మరి ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉందా అంటే.. లేదు. ఏపీ స్కిల్‌ డెవలప్‌ స్కామ్‌లో అరెస్ట్‌ అయిన చంద్రబాబు ప్రసుత్తం రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. లోకేష్‌ చూస్తేనేమో ఢిల్లీకే పరిమితం అయ్యారు. ఇలాంటి సమయంలో పార్టీని ముందుండి నడిపించే నాయకులు కరువయ్యారు. కొన్ని రోజులు పాటు బాలయ్య చేతికి పగ్గాలు అనే వార్తలు వచ్చాయి కానీ.. అవేవి నిజం కాదు.

ఈ క్రమంలో ప్రస్తుత టీడీపీ పరిస్థితి.. పవన్‌ కళ్యాణ్‌కి కలిసి వస్తుందని జనసేన పార్టీ నేతలు సూచిస్తున్నారట. ప్రసుత్తం టీడీపీని నడిపించే నేతల్లేరు. ఎలాను వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని చెప్పారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో.. టీడీపీ-జనసేన కూటమిని ముందుండి నడిపించే వ్యక్తిగా పవన్‌ ముందుకు వస్తే.. బాగుంటుందని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారట.

ఇక ప్రసుత్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. వచ్చే ఎన్నికల్లో తననే సీఎం క్యాండెట్‌గా ప్రకటించమని డిమాండ్‌ చేస్తే.. చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు కూడా అంగీకరిస్తారని.. ఇలాంటి అవకాశాన్ని పవన్‌ వాడుకోవాలని జనసేన నేతలు కోరుతున్నారు. అయితే పవన్‌ వ్యాఖ్యలు, జనసేన నేతల తీరు చూస్తే.. టీడీపీ నేతల గుండెలు గుబేల్‌మంటున్నాయి. పవన్‌లో కలిగిన ఈ కొత్త ఆశ.. ఎలాంటి పరిస్థితులుకు దారి తీస్తుందో అని భయపడుతున్నారని తెలుస్తోంది. అంతేకాక చూడబోతే పవన్‌.. బాబుకి వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని టీడీపీ తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. మరి పవన్‌ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి