iDreamPost

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరీ..

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరీ..

రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. మరో ఆరు నెలల్లోపు తెలంగాణ, ఏడాది లోపు ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలను ఇప్పటి నుంచి రచిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలుగు రాష్ట్రాల్లో  అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలు పలు మార్పులు చేస్తూ ముందుకు వెళ్తోంది. ఎన్నికల వ్యూహంలో భాగంగా బీజేపీ తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చేసింది.

భారతీయ జనతా పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల అధ్యక్షులను  మార్చేస్తూ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను జాతీయ అధినాయకత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర భాజపా కొత్త అధ్యక్షుడిగా జి. కిషన్‌రెడ్డిని నియమించింది. తెలంగాణ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను ప్రకటించింది. అలాగే..  బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని సైతం తీసుకుంది. ఇక ఏపీ విషయానికి వస్తే.. దగ్గుబాటి పురంధేశ్వరిని  రాష్ట్ర బీజేపీ కొత్త చీఫ్‌గా నియమిస్తూ జాతీయ  నాయకత్వం ప్రకటన విడుదల చేసింది. మంగళవారం కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్‌, షెకావత్‌తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమావేశమయ్యారు. అనంతరం.. పలు రాష్ట్ర అధ్యక్షులను ఖరారు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పంజాబ్‌, జార్ఖాండ్ లకు బీజేపీ అధ్యక్షులను నియమించింది. పంజాబ్ కు సునీల్‌ జక్కడ్‌, జార్ఖండ్ కు బాబులాల్ మారండి పేర్లను  ప్రకటించారు.

ఇక దగ్గుబాటి పురందేశ్వరి విషయానికి వస్తే.. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలుత 2004లో బాపట్ల నుంచి, 2009లో విశాఖ నుంచి కాంగ్రెస్ తరపున  ఎంపీ గా పోటీ చేసి గెలిచారు. యూపీఏ హయాంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా  కూడ పని చేశారు. ఏపీ విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ తీరుని వ్యతిరేకిస్తూ  2014లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ ఒడిశా రాష్ట్ర ఇన్ ఛార్జ్ గా ఉన్న పురందేశ్వరి.. వచ్చే లోక్ సభ ఎన్నిక  దృష్ట్యా ఏపీ బాధ్యతలు అప్పగించారు. మరి.. రాష్ట్ర అధ్యక్షుల విషయంలో బీజేపీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి