iDreamPost

విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా 2 రోజులు సెలవులు!

  • Published Mar 23, 2024 | 8:29 AMUpdated Mar 23, 2024 | 8:29 AM

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల‌కు మరో శుభవార్త అందింది. ఈ నెల‌లోనే మరోసారి వ‌రుస‌గా రెండు రోజులు పాటు స్కూళ్లకు, కాలేజ్ లకు సెల‌వులు రానున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల‌కు మరో శుభవార్త అందింది. ఈ నెల‌లోనే మరోసారి వ‌రుస‌గా రెండు రోజులు పాటు స్కూళ్లకు, కాలేజ్ లకు సెల‌వులు రానున్నాయి.

  • Published Mar 23, 2024 | 8:29 AMUpdated Mar 23, 2024 | 8:29 AM
విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా 2 రోజులు సెలవులు!

ప్రతిరోజు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్తు చదువుల్లో బిజీ అయిన విద్యార్థులకు సెలవు అంటే ఓ పండగలా ఉంటుంది. ఎందుకంటే.. ఈ విద్యార్థులకు సండే తప్పా మరో రోజు సెలవు దినం అంటూ ఉండదు. అలాంటి సమయంలో విద్యార్థులు అదనంగా సెలవులు ఇస్తే ఎంతో బాగున్నని అనుకుంటారు. కానీ అది జరిగే పని కాదు. అసలు పాఠశాలలు, కాలేజీలు రెండు, మూడు రోజులు అదనంగా సెలవులు ఇవ్వాలంటే కచ్చితంగా పండుగలు కూడా ఉండాలి. మరి, ఆ పండుగలు ఎప్పుడెప్పుడు వస్తాయంటూ విద్యార్థులు క్యాలెండర్ వైపు చూస్తూ సెలవులు కోసం ఎదురు చూస్తారు. ఇక విద్యార్థుల ఎదురుచూపుకు ఈ మార్చి నెల సెలవులకు సరైయనది అనే చెప్పాలి. ఇప్పటికే ఈనెల మార్చి 8న శివరాత్రి సందర్భంగా, అలాగే మార్చి9న సెకండ్ శాటర్ డే , ఆ తర్వాత రోజు సండే అని విద్యార్థులకు హాలీడే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి విద్యార్థులకు వరుసగా రెండు రోజులు హాలీడేస్ రాబోతున్నాయి. దీంతో విద్యార్థులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల‌కు మరో శుభవార్త అందింది.ఈ నెల‌లోనే వ‌రుస‌గా రెండు రోజులు పాటు స్కూళ్లకు, కాలేజ్ లకు సెల‌వులు రానున్నాయి. ఎందుకంటే.. దేశమంతా జరుపుకునే పండుగల్లో హోలీ పండుగ కూడా ఒకటి. ఈ పండుగ అనేది దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకుంటారు. అయితే హోలీ పండుగ అనేది సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. కనుక విద్యార్థులకు ఈనెల అనగా మార్చి 24వ తేదీన ఆదివారం కావడంతో.. ఆరోజు ఎలాగో హాలీడే తెలసిందే. ఇక ఆ తర్వాత రోజు అనగా మార్చి 25 సోమవారం హోలీ పండగ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో వ‌రుస‌గా రెండు రోజులు పాటు స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వులు రానున్నాయి. అలాగే మార్చి 29న గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా.. ఆ రోజున కూడా స్కూళ్లు, కాలేజీల‌కు సెలవు ఉంటుందన్న విషయం తెలిసిందే.

2 days holidays for schools

ఇక ఏప్రిల్ నెలలో బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5న సెలవు ఉండగా.. ఆ తర్వాత ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న, ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) సందర్భంగా ఏప్రిల్ 11వ తేదీన, ఆ తర్వాత ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా వరుస సెలవులు రానున్నాయి. అలాగే ఏప్రిల్ నెల చివ‌రి నుంచే వేసవి సెలవులు ప్రారంభంకానున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి