iDreamPost

వినియోగదారులకు మరో శుభవార్త చెప్పిన SBI!

వినియోగదారులకు మరో శుభవార్త చెప్పిన SBI!

ప్రభుత్వ రంగ సంస్థ అయిన SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వినియోగదారులకు మరో గుడ్ న్యూస్ ను అందించింది. ఇప్పటికే ఎన్నో సేవలు అందిస్తూ ముందుకు వెళ్తున్న ఎస్ బీఐ తాజాగా మరో శుభవార్తను అందించింది. రూపే నెట్ వర్క్ క్రిడిట్ కార్డులను UPI సేవలకు అనుసంధానం చేసుకునే వెసులు బాటును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. దీంతో స్కాన్ చేసి ఏదైనా వస్తువులు కొనుగోలు చేసే సమయంలో క్రిడిట్ కార్డులను వినియోగించుకోవచ్చని తెలిపింది.

దీనికి ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని SBI తెలిపింది. అయితే UPIకు క్రిడిట్ కార్డుల అనుసంధానం ద్వారా వాటి వినియోగం మరింత పెరిగే అవకాశం లేకపోలేదని తెలిపింది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు ఎన్నో సేవలు అందిస్తూనే తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ నిర్ణయంతో SBI కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, SBI వచ్చిన టెక్నాలజీని ఆధారంగా చేసుకుని అనుగుణంగా వినియోగదారులు ఎన్నో సేవలను అందించేందుకు ముందుకు వచ్చింది.

ఇది కూడా చదవండి: అదృష్టం అంటే అతడిదే.. 13 వేల కోట్ల లాటరీ గెలిచాడు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి