iDreamPost

ప్లీజ్ చివరిసారి వేడుకుంటున్నా.. ఈ వరల్డ్ కప్ ఆడి రిటైర్ అవ్వు: ఆండ్రీ రస్సెల్

ప్లీజ్ చివరిసారిగా వేడుకుంటున్నా.. ఈ ఒక్క వరల్డ్ కప్ ఆడి నువ్వు రిటైర్ అవ్వు అంటూ సునీల్ నరైన్ దీనంగా వేడుకుంటున్నాడట ఆండ్రీ రస్సెల్. ఆ వివరాల్లోకి వెళితే..

ప్లీజ్ చివరిసారిగా వేడుకుంటున్నా.. ఈ ఒక్క వరల్డ్ కప్ ఆడి నువ్వు రిటైర్ అవ్వు అంటూ సునీల్ నరైన్ దీనంగా వేడుకుంటున్నాడట ఆండ్రీ రస్సెల్. ఆ వివరాల్లోకి వెళితే..

ప్లీజ్ చివరిసారి వేడుకుంటున్నా.. ఈ వరల్డ్ కప్ ఆడి రిటైర్ అవ్వు: ఆండ్రీ రస్సెల్

క్రికెట్ లవర్స్ ను అలరించేందుకు మరో మెగాటోర్నీ సిద్దం అవుతోంది. మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. పొట్టి కప్ ను దక్కించుకోవడానికి 20 జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటికే అన్ని జట్లు తమ తమ టీమ్స్ ను ప్రకటించాయి. అయితే జట్టులో మార్పులు చేసుకోవడానికి మే 25 వరకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆండ్రీ రస్సెల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్లీజ్ చివరిసారిగా వేడుకుంటున్నా.. ఈ ఒక్క వరల్డ్ కప్ ఆడి రిటైర్ అవ్వు అంటూ సునీల్ నరైన్ ను దీనంగా వేడుకున్నాడు రస్సెస్.

అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా టీ20 ప్రపంచ కప్ కు ఆతిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని జట్లు తమ తమ జట్లను ప్రకటించాయి. జట్టులో ఏమైనా మార్పులు చేసుకోవడానికి మే 25 వరకు ఛాన్స్ ఉంది. దీంతో సునీల్ నరైన్ ను బతిమిలాడుతున్నాడు ఆండ్రీ రస్సెల్. “ఈ ఐపీఎల్ లో నరైన్ ప్రదర్శన చూసి.. ఎంతో సంతోషిస్తున్నాను. గౌతమ్ గంభీర్ అతడిని ఓపెనర్ గా పంచించి అద్భుతం చేశాడు. గతంలో నరైన్ చివరి స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చేవాడు. కానీ ఎలాంటి ఫలితం ఉండకపోయేది. ఓ బౌలర్ దాదాపు 500 రన్స్ చేయడం మామూలు విషయం కాదు. బౌలింగ్ లో కూడా 16 వికెట్లు తీశాడు.

Andre russel

”ఇక వరల్డ్ కప్ జట్టు ప్రకటించిన అప్పటి నుంచి దాదాపు, రెండు వారాల పాటు నరైన్ తో మాట్లాడుతూనే ఉన్నా. ప్లీజ్ ఈ ఒక్క వరల్డ్ కప్ ఆడి.. రిటైర్ అవ్వు అని వేడుకుంటున్నా. కానీ అతడు ఏం సమాధానం చెప్పడం లేదు” అంటూ రస్సెల్ చెప్పుకొచ్చాడు. కాగా.. భీకర ఫామ్ లో ఉన్న సునీల్ నరైన్ ను ఎలాగైనా టీ20 వరల్డ్ కప్ లో ఆడించాలి మాజీ క్రికెటర్లు, విండీస్ బోర్డ్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. కానీ అతడు మాత్రం తన సమాధానం చెప్పడం లేదు. మరి సునీల్ నరైన్ కోసం విండీస్ మాజీ క్రికెటర్లు చేస్తున్న ప్రయత్నాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి