iDreamPost

Davos టెక్నాలజీ హబ్‌గా వైజాగ్, టెక్‌ మహీంద్రా సీఈవోతో సీఎం జగన్‌ చర్చలు, ఇంకా ఎవ‌రిని క‌లిశారంటే

Davos టెక్నాలజీ హబ్‌గా వైజాగ్, టెక్‌ మహీంద్రా సీఈవోతో సీఎం జగన్‌ చర్చలు, ఇంకా ఎవ‌రిని క‌లిశారంటే

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు రెండో రోజు ఏపీ సీఎం జగన్ బిజిబిజీగా గ‌డిపారు. అగ్ర‌గామి వ్యాపార‌సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించారు. రెండో రోజు ఉదయం సెషన్‌లో, ఫ్యూచర్‌ ప్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్‌ సదస్సులో పాల్గొన్న సీఎం, ఆ తర్వాత దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌, టెక్‌ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీలను క‌లిశారు.

దస్సాల్ట్‌ సిస్టమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్‌తో సీఎం జగన్‌ భేటీ ఫ‌ల‌ప్ర‌ద‌మైంది. ఆ త‌ర్వాత‌ ఫ్లోరెన్స్‌ వెర్జలెన్ మాట్లాడారు. ఏపీ సీఎం జగన్‌తో సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందని, నైపుణ్యాలను ఎలా అభివృద్ధిచేయాలన్నదానిపై చర్చ జరిగినట్టు తెలిపారు. కొత్త తరహా ఇంధనాలపైనా కూడా సమావేశంలో చర్చించామన్నారు. విద్యారంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దస్సాల్ట్ ఆస‌క్తిగా ఉంద‌ని ఆమె అన్నారు.

దావోస్‌లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌కి వచ్చిన టెక్‌ మహీంద్రా సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీని సీఎం క‌లిశారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మానవ వనరుల లభ్యత తదితర అంశాలపై వారు చ‌ర్చించుకున్నారు. విశాఖపట్నాన్ని మేజర్‌ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని సీఎం జగన్‌ సంకల్పంతో ఉన్నారని సీపీ గుర్నానీ చెప్పారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని టెక్‌ మహీంద్రాను సీఎం కోరారని తెలిపారు. ఆమేర‌కు ఆంధ్రా వర్శిటీతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు టెక్‌ మహీంద్రా సీఈఓ శుభ‌వార్త చెప్పారు. మానవ నైపుణ్యాలను పెంచేందుకు, హైఎండ్‌ టెక్నాలజీపై వచ్చే మూడు నెలల్లో ఆంధ్ర యూనివర్శిటీతో కలిసి ప్రత్యేక పాఠ్యప్రణాళికను తీర్చిదిద్ద‌డంతోపాటు, ఆర్టిఫియల్‌ ఇంలెటిజెన్స్‌కు మెయిన్ సెంట‌ర్ గా వైజాగ్ ను తీర్చిద్దాలన్న వ్యూహంతో సీఎం జగన్‌ ఉన్నట్టు గుర్నానీ వెల్లడించారు.

భారీ ఎత్తున పెట్టుబడులను అయిస్కాంతంలా ఆక‌ట్టుకొనేందుకు దావోస్ సమావేశాలను వేదిక‌గా ఏపీ ప్రభుత్వం మ‌లుచుకుంది. అందులో భాగంగానే రెండో రోజు, సీఎం పలువురు ప్రముఖులతో భేటీ అవుతున్నారు. జపాన్‌కు చెందిన మిట్సుయి ఒ.ఎస్‌.కె.లైన్స్‌ లిమిటెడ్‌ సీఈఓ తకేషి హషిమొటోతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. హీరోమోటార్‌ కార్పొరేషన్‌ చైర్మన్ ఎండీ పవన్‌ ముంజల్ ను జగన్ క‌లిశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి