iDreamPost

చావు బతుకుల్లో సహాయం కోసం ఎదురుచూస్తున్న కానిస్టేబుల్ కుటుంబం!

చావు బతుకుల్లో సహాయం కోసం ఎదురుచూస్తున్న కానిస్టేబుల్ కుటుంబం!

రోడ్డు ప్రమాదంలో మనిషి చనిపోవడం అంటే.. ఒక కుటుంబం రోడ్డున పడట్లే. రెండ్రోజుల క్రితం అనంతపురం నగర శివారు సోమలదొడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన భార్య సతీమణి అనిత ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆమె అపస్మారక స్థితిలో ఉంది. సర్జరీ చేస్తే అనిత బతికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే అందుకు రూ.10 లక్షలు వరకు ఖర్చు అవుతుంది.

రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ మరణంతో వారి కుటుంబం దిక్కుతోచని స్థితిలోకి వెళ్లినట్లైంది. ఆయన భార్య అనిత వైద్యానికి రూ.10 లక్షల వరకు కావాల్సి వస్తాయని చెబుతున్నారు. కిరణ్ కుమార్ మరణించడం, అనిత ఆస్పత్రిలో ఉండటం, పిల్లు చిన్నవాళ్లు కావడంతో ఆ కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే కిరణ్ కుమార్ కుటుంబానికి ఎస్పీ కంచి శ్రీనివాసరావు అండగా నిలిచారు. అనిత వైద్యం కోసం 3 లక్షల రూపాయల చెక్కును ఆ కుటుంబానికి అందజేశారు. అంతేకాకుండా ఒక కానిస్టేబుల్ ని ఆస్పత్రిలోనే ఉంచి.. వైద్యం చక్కగా అందేలా చర్యలు తీసుకున్నారు. అక్కడితో వదిలేయకుండా.. ఆమెకు వైద్యం ఎలా అందుతుందో ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు.

కిరణ్ కుమార్ మరణంతో సహోద్యోగులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ కుమార్ ఎప్పుడూ అందరితో చక్కగా కలిసిపోయి ఉండేవాడని చెబుతున్నారు. అందరూ కిరణ్ ను తల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సతీమణి ఆరోగ్యం విషమించిన విషయాన్ని సోషల్ మీడియాలో చూసి అందరూ తమవంతు సాయం చేశారు. కేవలం గంటల వ్యవధిలోనే దాదాపు రెండున్నర లక్షల రూపాయలు అందజేశారు. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా తమకు తోచినంత సాయం చేశారు. పీటీసీలో పనిచేసే డీఎస్పీ మల్లికార్జున వర్మ రూ.25 వేలు, కియా పోలీస్ స్టేషన్ సిబ్బంది రూ.10 అందజేశారు. కిరణ్ కుమార్ కుటుంబానికి మేమున్నాం అంటూ అందరూ ముందుకొస్తున్నారు. మీలో ఎవరైనా ఆర్థిక సాయం చేయాలి అనుకుంటే ఈ కింద ఉన్న వారి ఫోన్ పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్ నంబర్లకు నేరుగా డబ్బు పంపవచ్చు. కిరణ్ కుమార్ భార్య అనిత వైద్యం కోసం మీ వంతు సాయం చేయచ్చు. అలాగే ఆ చిన్నారులు అనాథలు కాకుండా మీరు కాపాడచ్చు.

Constable's wife among the dead! 2

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి