iDreamPost

అనంత్ – రాధిక ప్రీ వెడ్డింగ్ కోసం క్రూయిజ్ షిప్‌! 800 మంది అతిధులు!

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మరో ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేసింది ఆ కుటుంబం.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మరో ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేసింది ఆ కుటుంబం.

అనంత్ – రాధిక ప్రీ వెడ్డింగ్ కోసం క్రూయిజ్ షిప్‌! 800 మంది అతిధులు!

అపర కుబేరుడు, ఇండియన్ టైకూన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్, నీతా అంబానీల ముద్దుల తనయుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన చిరకాల స్నేహితురాలు రాధికను త్వరలో మూడు ముళ్లు వేయనున్నాడు. జులై 12న వీరి పెళ్లి లండన్‌లో జరగనుంది. దీంతో తమ ఇంటికి వచ్చే కోడలికి సర్ ప్రైజ్ పార్టీని ప్లాన్ చేస్తుంది ముఖేష్ అంబానీ ఫ్యామిలీ. ప్రీ వెడ్డింగ్ బాష్‌ను నిర్వహిస్తున్నారు. గతంలో ప్రీ వెడ్డింగ్ పార్టీని అంగరంగ వైభవంగా చేపట్టిన సంగతి విదితమే. గుజరాత్‌లోని జామ్ నగరలో మూడు రోజుల పాటు ఘనంగా ఈ వేడుకను నిర్వహించింది ముఖేష్ అంబానీ ఫ్యామిలీ. సినీ, క్రీడా, రాజకీయ పండితులే కాకుండా విదేశీ ప్రముఖుల్ని కూడా ఆహ్వానించింది ఆ కుటుంబం.

వీరి పిలుపు మేరకు మెటా ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్, వరల్డ్ పాప్ స్టార్ రిహాన్నాతో పాటు బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్లు సందడి చేసిన సంగతి విదితమే. ఈ వేడుకకే రూ. 1250 కోట్లను వెచ్చించినట్లు పోర్బ్స్ వెల్లడించింది. అలాగే ఇప్పుడు మరోసారి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లను నిర్వహించనుంది ముఖేష్ అంబానీ కుటుంబం. ఈ సారి మరింత లగ్జరీయస్‌గా ప్లాన్ చేశారు. ఏకంగా క్రూయిజ్ షిప్‌లో నిర్వహించనున్నారు. మే 29 నుండి జూన్ 1 వరకు ఈ వేడుకలు జరగనున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ పై బోల్డ్ లెటర్స్‌లో “లా విట్ ఈ అన్ వియాజియో” అని రాసి ఉంది.. అంటే దీనర్థం…’లైఫ్ ఈజ్ ఎ జర్నీ’.  800 మంది అతిధుల్ని ఆహ్వానించారు.  600 మంది అంకితమైన హాస్పిటాలిటీ సిబ్బంది ఆన్‌బోర్డ్‌లో ఉంటారు. ఈ సారి ఖర్చు గతం క న్నా ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

సముద్ర అలలపై క్రూయిజ్ కదలాడుతూ ఉండగా… ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రూయిజ్ ఇటలీ నుండి దక్షిణ ప్రాన్స్ వెళుతుందని.. దాదాపు 4380 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని సమాచారం. ఈ వేడుకకు కూడా సినీ సెలబ్రిటీలు రాబోతున్నారని టాక్. ఇప్పటికే వారికి ఆహ్వానాలు వెళ్లాయని తెలుస్తోంది. బాలీవుడ్ త్రీ ఖాన్స్.. బాద్ షా షారూఖ్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్, యానిమల్ హీరో రణబీర్ కపూర్ ఆయన సతీమణి అలియా భట్ ఈ వేడుకకు హాజరుకానున్నారని సమాచారం. ఇప్పటికే అక్కడికి సినీ ప్రముఖులు అక్కడికి బయలు దేరినట్లు తెలుస్తోంది. ఈ సారి కూడా పెద్ద యెత్తులో అతిరథ మహారథులు రానున్నట్లు సమాచారం. గట్టిగానే ఈ ప్రీ వెడ్డింగ్ ప్లాన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి