iDreamPost

ఆఫ్రికాలో అంబానీ దిమ్మతిరిగే ప్లాన్.. భారత్ లో వ్యూహమే అక్కడ కూడా..!

Mukesh Ambani Plans To Enter African: భారత టెలికాం రంగంలో అగ్రగామిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు.

Mukesh Ambani Plans To Enter African: భారత టెలికాం రంగంలో అగ్రగామిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు.

ఆఫ్రికాలో అంబానీ దిమ్మతిరిగే ప్లాన్.. భారత్ లో వ్యూహమే అక్కడ కూడా..!

రిలయన్స్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వ్యాపార రంగంలో అగ్రగామిగా ఉన్న కొన్ని సంస్థల్లో రిలయన్స్ ఒకటి. బిజినెస్ లోని అన్ని రకాల సెక్టార్లలో ఈ రిలయన్స్ మార్క్ అనేది కనిపిస్తుంది. దీని సంస్థ అధినేత ముకేశ్ అంబానీ కారణంగానే సక్సెస్ గా సాగుతోంది. ఇక ఆయన వ్యాపార రంగంలో తీసుకునే నిర్ణయాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా..పెనుమార్పులను తీసుకోస్తున్నాయి. అందుకు ఉదాహరణ..జియోనే. దీనిని ప్రారంభించడంతో టెలికాం రంగంలో పెనుమార్పులు సంబంధించి.  టెలికాం రంగలో జియో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.  అంబానీ పక్కా వ్యూహంతో భారత్ లో జియోను లాంచ్ చేసి.. సక్సెస్ అయ్యారు. తాజాగా ఇదే వ్యూహంతో ఆఫ్రికాలోనూ జియోను ప్రారంభించేందు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

భారత టెలికాం రంగంలో అగ్రగామిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే జియో సినిమాలు, ఫ్రీగా ఐపీఎల్ చూసే అవకాశం కల్పిస్తూ వినియోగాదరుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేశారు. అలానే 5 జీ సేవలను కూడా అందిస్తోంది. తాజాగా జియో సేవలను ఆఫ్రికాకూ విస్తరించేందుకు రిలయన్స్ సిద్ధమవుతోంది. ఆఫ్రికాలో జియో సేవలను విస్తరించేందుకు  ఆ ఖండంలోని ఘనా దేశంకు చెందిన నెక్ట్స్‌-జెన్‌ ఇన్‌ఫ్రాకో(ఎన్జీఐసీ)తో జియో చేతులు కలపనుంది. రిలయన్స్‌కు చెందిన ర్యాడిసిస్‌ కార్ప్‌తో ఎన్‌జీఐసీ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఘనాలో 5జీ సేవలను అందించేందుకు కావాల్సిన సదుపాయాలను ఎన్‌జీఐసీ ఏర్పాటు చేయనుంది.

అలానే ఈ ప ప్రాజెక్ట్ కు అవసరమయ్యే పరికరాలు, స్మార్ట్‌ఫోన్లు, అప్లికేషన్లను  రిలయన్స్ కు చెందిన ర్యాడిసిస్‌ సమకూర్చనుంది. ఇదే విషయాన్నిఎన్‌జీఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెల్లడించినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. ఇండియాలో జియో విషయంలో చేసిన ప్లాన్లనే ఘనాలోను అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 2016లో ప్రారంభమైన జియో.. స్వల్ప కాలంలో భారత్‌లో అగ్రగామి టెలికాం ప్రొవైడర్‌గా అవతరించిన సంగతి అందరికి తెలిసిందే. ఫ్రీ వాయిస్‌ కాలింగ్‌, తక్కువ ధరకే డేటా వంటి వ్యూహాలతో మార్కెటింగ్‌ ఎంట్రీ ఇచ్చి ప్రత్యర్థి సంస్థలకు చెక్‌ పెట్టింది.

ప్రస్తుతం దాదాపు 47 కోట్ల సబ్‌స్క్రైబర్లతో జియో టాప్ లో కొనసాగుతోంది. 2024 చివరి నాటికి ఘనాలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎన్‌జీఐసీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఎన్‌జీఐసీలో రిలయన్స్‌కు ఎలాంటి ఈక్విటీ వాటాలు లేనట్లు తెలుస్తోంది. ఆఫ్రికాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న అసెండ్‌ డిజిటల్‌ సొల్యూషన్స్‌, కె-నెట్‌ కంపెనీలు ప్రధాన పెట్టుబడిదారులుగా ఉన్నాయి. వీటికి 55 శాతం వాటా ఉండగా ఘనా ప్రభుత్వానికి 10 శాతం ఉంది. భవిష్యత్తులో రిలయన్స్ కు వాటా తీసుకునే అవకాశం కల్పిస్తామని ఎన్‌జీఐసీ ప్రతినిధి తెలిపారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి