iDreamPost

అంబానీ గొప్ప మనసు.. 51 వేల మందికి అన్నసేవా.. స్వయంగా వడ్డిస్తూ..

ముఖేష్ అంబానీ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తన కొడుకు పెళ్లి సందర్భంగా 51 వేల మందికి భోజనాలు పెట్టించారు. స్థానికులకు ఏర్పాటు చేసిన విందులో స్వయంగా వడ్డించి ముఖేష్ అంబానీ మనసులు దోచుకున్నారు.

ముఖేష్ అంబానీ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తన కొడుకు పెళ్లి సందర్భంగా 51 వేల మందికి భోజనాలు పెట్టించారు. స్థానికులకు ఏర్పాటు చేసిన విందులో స్వయంగా వడ్డించి ముఖేష్ అంబానీ మనసులు దోచుకున్నారు.

అంబానీ గొప్ప మనసు.. 51 వేల మందికి అన్నసేవా.. స్వయంగా వడ్డిస్తూ..

వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన ముఖేష్ అంబానీ తనకు తానే సాటిగా నిలుస్తున్నారు. తరాలు కూర్చుని తిన్నా తరగని సంపదను సృష్టించి నయా చరిత్రకు నాంది పలికారు. నేడు ఆసియా కుబేరుడిగా ముఖేష్ అంబానీ కీర్తి గడించారంటే దాని వెనకాల ఆయన చేసిన అసాధారణమైన కృషి దాగుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ఎన్నో గొప్ప పనులకు శ్రీకారం చుట్టారు. సంస్థ ఉద్యోగుల సంక్షేమం, పేద విద్యార్థుల కోసం స్కాలరషిప్స్, పేదలకు సాయం అందించడం, ప్రకృతి వైపరీత్యాలు సంబవించినప్పుడు విరాళాలు అందిస్తూ మానవత్వాన్ని చాటారు. మరోసారి ముఖేష్ అంబాని గొప్ప మనసును చాటుకున్నారు. తన కొడుకు పెళ్లి సందర్భంగా 51 వేల మందికి భోజనాలు పెట్టి ‘అన్నసేవ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి.

బిజినెస్ రంగంలో తిరుగులేని రారాజుగా నిలిచిన ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ముకేశ్‌, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్‌, ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్‌ మర్చంట్ కుమార్తె రాధిక తో జూలైలో పెళ్లి జరుగనుంది. అయితే వీరి పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 1 నుంచి 3 వరకు ఈ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. దీంతో అంబానీ ఇంట పెళ్లి టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారుమ్రోగుతోంది. ఈ నేపథ్యంలో జామ్‌నగర్‌లోని ఓ గ్రామంలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అన్న సేవతో ప్రారంభమయ్యాయి.

ప్రీ వెడ్డింగ్ వేళ అంబానీ కుటుంబం విందు ఏర్పాటు చేసింది. గుజరాత్​ జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో అన్న సేవను ఘనంగా ప్రారంభించారు. 51 వేల మంది స్థానికులకు అంబానీ కుటుంబ సభ్యులు స్వయంగా ఆహారాన్ని వడ్డించారు. ఈ అన్నసేవలో ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా, కొడుకు అనంత్ అంబానీ, కాబోయే కోడలు రాధిక మర్చెంట్ ఆహుతులకు స్వయంగా వడ్డించిన ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. 51 వేల మందికి భోజనాలు పెట్టి స్వయంగా వడ్డించిన ముఖేష్ అంబానీపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి