iDreamPost

Ananda Bhairavi : సంగీతనృత్య అపురూప దృశ్యకావ్యం

అప్పుడే కొండముదిశ్రీరామచంద్రమూర్తి రాసిన 'చిరుమువ్వల మరుసవ్వడి' సీరియల్ ని చదివారు. మనసుకు హత్తుకుంది. కళకు ఆడామగా అనే లింగ భేదం ఉండకూడదనే గొప్ప సందేశంతో రాసిన ఆ నవలకు తెరరూపం ఇవ్వాలని నిశ్చయించుకున్నారు.ప్రధాన పాత్రకు గిరీష్ కర్నాడ్ ను ఎంపిక చేసుకున్నారు. కేవలం ఈ క్యారెక్టర్ కోసమే ఆయన కష్టపడి నాట్యం నేర్చుకోవడం సంచలనం.

అప్పుడే కొండముదిశ్రీరామచంద్రమూర్తి రాసిన 'చిరుమువ్వల మరుసవ్వడి' సీరియల్ ని చదివారు. మనసుకు హత్తుకుంది. కళకు ఆడామగా అనే లింగ భేదం ఉండకూడదనే గొప్ప సందేశంతో రాసిన ఆ నవలకు తెరరూపం ఇవ్వాలని నిశ్చయించుకున్నారు.ప్రధాన పాత్రకు గిరీష్ కర్నాడ్ ను ఎంపిక చేసుకున్నారు. కేవలం ఈ క్యారెక్టర్ కోసమే ఆయన కష్టపడి నాట్యం నేర్చుకోవడం సంచలనం.

Ananda Bhairavi : సంగీతనృత్య అపురూప దృశ్యకావ్యం

హాస్య బ్రహ్మ జంధ్యాల మనకు కామెడీ చిత్రాలతోనే రచయితగా దర్శకుడిగా ఎక్కువ గుర్తుండిపోయారు కానీ ఆయన అందించిన మ్యూజికల్ క్లాసిక్స్ కూడా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనుకునేలా ఉంటాయి. అందులో ఒకటి ఆనంద భైరవి. ఆ విశేషాలు చూద్దాం. 1984. అప్పటికి జంధ్యాల గారు 8 సినిమాలు డైరెక్ట్ చేశారు. శ్రీవారికి ప్రేమలేఖ తెలుగు రాష్ట్రాన్ని ఊపేసిన సమయమది. తొమ్మిదోది మాత్రం కె విశ్వనాథ్ శంకరాభరణం తరహాలో శాశ్వతంగా నిలిచిపోయే ఆణిముత్యాన్ని తీయాలని జంధ్యాల సంకల్పించుకున్నారు. అప్పుడే కొండముదిశ్రీరామచంద్రమూర్తి రాసిన ‘చిరుమువ్వల మరుసవ్వడి’ సీరియల్ ని చదివారు. మనసుకు హత్తుకుంది. కళకు ఆడామగా అనే లింగ భేదం ఉండకూడదనే గొప్ప సందేశంతో రాసిన ఆ నవలకు తెరరూపం ఇవ్వాలని నిశ్చయించుకున్నారు.

ప్రధాన పాత్రకు గిరీష్ కర్నాడ్ ను ఎంపిక చేసుకున్నారు. కేవలం ఈ క్యారెక్టర్ కోసమే ఆయన కష్టపడి నాట్యం నేర్చుకోవడం సంచలనం. యువజంటలో అబ్బాయిగా రాజేష్(ఇప్పటి హీరోయిన్ ఐశ్యర్య రాజేష్ అన్నయ్య), అమ్మాయిగా బెంగాల్ కు చెందిన మాళవిక సర్కార్ ని తీసుకొచ్చారు. కథానుసారం కూచిపూడి రాకపోయినా స్వతహాగా కథక్ కళాకారిణి కావడంతో జంధ్యాల గారు వేరే ఆలోచన చేయలేదు. షూటింగ్ లో అధిక శాతం రాజమండ్రిలో చిత్రీకరించారు. రమేష్ నాయుడు స్వరపరిచిన తొమ్మిది పాటలు విని పరవశించని వారు లేరు. ఎస్ గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం బాధ్యతలు తీసుకున్నారు. షూట్ లో ఎన్నో ఆటంకాలు. అన్నీ తట్టుకుని చేశారు కళ్యాణి ఆర్ట్ ఫిలింస్ అధినేతలు. సీనియర్ నటీమణి కాంచనగారికి ఇది ఆఖరి సినిమా.

బిజినెస్ పరంగా చాలా ఇబ్బందులు వచ్చాయి. చివరికి శాండిల్య హక్కులు కొన్నారు. విడుదలకు ముందే ఆనందభైరవికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, రెండవ ఉత్తమ కథా రచయిత విభాగాల్లో నంది అవార్డులు వచ్చాయి. దెబ్బకు థియేటర్లు దొరికేశాయి. 1984 ఏప్రిల్ 19 విడుదలైన ఆనందభైరవి జనాన్ని సంగీత నాట్య సాగరంలో ఓలలాడించింది. ముందు వెనుక రిలీజైన చిరంజీవి ‘దేవాంతకుడు’, శోభన్ బాబు ‘కోడెత్రాచుల’ను ఓవర్ టేక్ చేసి మరీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సంవత్సరం జూన్ లో వంద రోజుల వేడుక జరిపారు. కన్నడలో ద్వారకేష్ నిర్మాతగా ఇదే టైటిల్ తో రీమేక్ అయ్యింది. నిర్మాతకు సంబంధించిన వ్యక్తిగత కారణాల వల్ల జాతీయ అవార్డులకు సకాలంలో అప్లై చేసుకోకపోవడం వల్ల దాన్ని మిస్ చేసుకుంది

Also Read : Criminal : భార్యను హత్య చేసిన డాక్టర్ కథ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి