iDreamPost
android-app
ios-app

BAN vs USA: క్రికెట్ లో పెను సంచలనం.. బంగ్లాపై అమెరికా సిరీస్ విజయం!

క్రికెట్ లో పెను సంచలనం నమోదు చేసింది అమెరికా. బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

క్రికెట్ లో పెను సంచలనం నమోదు చేసింది అమెరికా. బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

BAN vs USA: క్రికెట్ లో పెను సంచలనం.. బంగ్లాపై అమెరికా సిరీస్ విజయం!

ప్రపంచ క్రికెట్ లో పెను సంచలనం నమోదైంది. బంగ్లాదేశ్-అమెరికా మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసందే. ఈ సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే అమెరికా కైవసం చేసుకుని బంగ్లాదేశ్ కు ఊహించని షాకిచ్చింది. తొలి మ్యాచ్ లోనే విజయం సాధించి.. బంగ్లాకు హెచ్చరికలు పంపిన యూఎస్ఏ, రెండో మ్యాచ్ లోనూ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు సంబందించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీ20 క్రికెట్ లో సంచలనం సృష్టించింది అమెరికా. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టీ20లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో క్రికెట్ లో పూర్తి సభ్యదేశంపై తొలి సిరీస్ విజయం సాధించి చరిత్ర నెలకొల్పింది. దాంతో టీ20 వరల్డ్ కప్ ముందు యూఎస్ఏకు రెట్టించిన ఉత్సాహం వచ్చింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. కెప్టెన్ మోనాంక్ పటేల్(45), ఆరోన్ జోన్స్(35) పరుగులతో రాణించారు. అనంతరం 145 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లా.. అమెరికా బౌలర్ల ధాటికి 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

దాంతో 6 పరుగుల స్వల్ప  తేడాతో అమెరికా సంచలన విజయం సాధించింది. కెప్టెన్ షాంటో(36) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతావారు విఫలం కావడంతో.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో బంగ్లా ఇలా పసికూనపై సిరీస్ కోల్పోవడం.. ఆ జట్టు ఆత్మవిశ్వాన్ని దెబ్బతీస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి బంగ్లాను ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న అమెరికా జట్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి