iDreamPost

టాటా ఇన్‌స్టిట్యూట్ అద్భుత విజయం.. రూ.100కే క్యాన్స‌ర్ ట్యాబ్లెట్..!

Tata Institute is a Great Success: క్యాన్సర్ భారినపడితే చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతుంది.. అలాంటిది టాటా ఇన్‌స్టిట్యూట్ క్యాన్సర్ చికిత్స కోసం అద్భుతం సృష్టించింది.. అదేంటంటే..

Tata Institute is a Great Success: క్యాన్సర్ భారినపడితే చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతుంది.. అలాంటిది టాటా ఇన్‌స్టిట్యూట్ క్యాన్సర్ చికిత్స కోసం అద్భుతం సృష్టించింది.. అదేంటంటే..

టాటా ఇన్‌స్టిట్యూట్ అద్భుత విజయం.. రూ.100కే క్యాన్స‌ర్ ట్యాబ్లెట్..!

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ భారిన పడి లక్షల మంది చనిపోతున్నారు. క్యాన్సర్ పేరు వింటేనే చావు అంచుకు చేరుకున్నట్లుగా భావిస్తుంటారు. క్యాన్సర్ చికిత్స కోసం లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది.. అయినా బతికి బయటపడతారన్న నమ్మకం ఉండదు. ఇటీవల కొంతమంది క్యాన్సర్ బారి నుంచి బయటపడ్డా కొంతకాలానికే మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టడంతో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. రెండోసారి క్యాన్సర్ బారిన పడితే.. శారీరకంగానే కాదు మానసికంగా కుంగిపోయి చనిపోతున్నారు. అలాంటి వారి కోసం ముంబై కేంద్రంగా పనిచేస్తున్న టాటా ఇన్‌స్టిట్యూట్ గొప్ప శుభవార్త చెప్పింది. ఇంతకీ ఆ శుభవార్త ఏంటీ? వారు కనుగొన్నది ఏంటీ? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

క్యాన్సర్ భారిన పడి బతికి బయటపడ్డా.. రెండోసారి తిరగబడి చనిపోతున్న వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగిపోయింది. అలాంటి వారికి కోసం ముంబై కి చెందిన టాటా ఇన్‌స్టిట్యూట్ గుడ్ న్యూస్ చెప్పంది. ఒకసారి క్యాన్సర్ బారిన పడి కోలుకున్న వారు రెండోసారి కాన్సర్ రాకుండా నిరోదించే ట్యాబ్లెట్ ని రూపొందించినట్లు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ప్రకటించింది. ఇందుకోసం పదేళ్ల పాటు ఎన్నో పరిశోధనలు చేసి చివరికి ఈ దివ్య ఔషదాన్ని కనుగొన్నట్లు పరిశోధకులు, వైద్యులు తెలిపారు. రెండోసారి క్యాన్సర్ బారిన పడితే దాన్ని అడ్డుకోవడమే కాదు.. రేడియేషన్, కీమోథెరపీ కారణంగా తలెత్తే దుష్ప్రభావాలను సైతం ఈ టాబ్లెట్ తగ్గిస్తుందని టీఐఎఫ్ఆర్ పరిశోధకులు పేర్కొన్నారు.

ఈ ట్యాబ్లెట్ గురించి సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే మాట్లాడుతూ.. ‘ఈ దివ్యఔషదాన్ని ఆవిష్కరించడానికి పదేళ్ల పాటు నిర్విరామంగా ఎంతోమంది పరిశోధకులు, వైద్యులు కష్టపడ్డాం. పరిశోధన కోసం నిపుణులు ఎలుకలలో మానవ క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టారుర. దాంతో క్యాన్సర్ కణితి ఏర్పడింది. తర్వాత ఎలుకకు కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీతో చికిత్స చేశారు. కొంతకాలనికి ఆ క్యాన్సర్ కణాలు చనిపోయి ‘క్రోమాటిన్ కణాలు’ అని పిలిచే చిన్న ముక్కలుగా విడిపోయినట్లు గుర్తించారు పరిశోధకులు. రెండోసారి క్యాన్సర్ వచ్చే అవకాశాలను రినోధించేందుకు పరిశోధకులు ఎలుకలకు రెస్వెరాట్రాల్, కాపర్ (R+Cu) కలిగి ఉన్న ప్రో-ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ ఇచ్చాం. కాపర్ (R+Cu) ఆక్సీజన్ రాడికల్ ను ఉత్పత్తి చేసి.. క్రోమాటిన్ కణాలను నాశనం చేస్తుందని పరిశోధనలో తేలింది. పరిశోధకులు అభివృద్ది చేసిన ఈ ట్యాబ్లట్ క్యాన్సర్ చికిత్స దుష్ప్రభావాలను 50 శాతం వరకు తగ్గిస్తుంది.. అంతేకాదు రెండోసారి క్యాన్సర్ ను నివారించడంలో 30 శాతం వరకు ప్రభావంతంగా పనిచేస్తుంది. అయితే ఈ ట్యాబ్లెట్ మార్కెట్ లోకి రావాలంటే.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అమోధం లభించాల్సి ఉంది’ అని అన్నారు.

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వారు కనుగొన్న ఈ అద్భుతమైన ట్యాబ్లెట్ జూన్-జులైలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ట్యాబ్లెట్ ఎంతోమంది మంది క్యాన్సర్ బాధితులకు వరంగా మారనుంది. క్యాన్సర్ చికిత్సను మెరుగుపర్చడంలో ఈ ట్యాబ్లెట్ చాలా వరకు సహాయపడుతుందని సీనియర్ క్యాన్సర్ సర్జన్ అంటున్నారు. క్యాన్సర్ చికిత్స కోసం లక్షల్లో ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ ట్యాబ్లెట్ కేవలం రూ.100లకు కాస్త అటూఇటుగా అందుబాటులోకి తెస్తామని సంస్థకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఇది పేదవాళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ట్యాబ్లెట్ మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తే.. నిజంగా టాటా ఇన్‌స్టిట్యూట్ ఒక అద్భుతమైన విజయమే అంటున్నారు. మరి టాటా ఇన్స్టిట్యూట్ 100 రూపాయలకే క్యాన్సర్ ని తగ్గించే టాబ్లెట్ తీసుకొస్తుండడంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజే

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వారు కనుగొన్న ఈ  ట్యాబ్లెట్ జూన్-జులైలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.  ఇది ఎంతోమంది మంది క్యాన్సర్ బాధితులకు వరంగా మారనుంది. క్యాన్సర్ చికిత్సను మెరుగుపర్చడంలో ఈ ట్యాబ్లెట్ చాలా వరకు సహాయపడుతుందని సీనియర్ క్యాన్సర్ సర్జన్ అంటున్నారు. క్యాన్సర్ చికిత్స కోసం లక్షల్లో ఖర్చు చేయాల్సి వచ్చేంది. ఈ ట్యాబ్లెట్ కేవలం రూ.100లకు కాస్త అటూఇటుగా అందుబాటులోకి తేస్తామని సంస్థకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఇది పేదవాళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ట్యాబ్లెట్ మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తే.. నిజంగా టాటా ఇన్‌స్టిట్యూట్ ఒక అద్భుతమైన విజయమే అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి