iDreamPost

ఈడీ విచారణ ఎఫెక్ట్‌ – భూములు కొన్న బినామీలను దాచేస్తున్నారు

ఈడీ విచారణ ఎఫెక్ట్‌ – భూములు కొన్న బినామీలను దాచేస్తున్నారు

అమరావతిలో సాగిన భూ కుంభకోణంపై ఈడీ అధికారుల విచారణ శరవేగంగా సాగుతోంది. విచారణ ముందుకు సాగదులే అని దీమాగా ఉన్న నేతల్లో ఇప్పుడు భయం పట్టుకుంది. తెల్లరేషన్‌కార్డు దారులను ముందు పెట్టి అనుమానం రాకుండా గత ప్రభుత్వ పెద్దలు అల్లుకుంటూ పోయిన చిక్కుముడులను సీఐడీ, ఈడీ అధికారులు ఒక్కొక్కటిగా విప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘రాజధానిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను దమ్ముంటే నిరూపించండి’ అని సవాళ్లు విసిరిన నేతలు ఇప్పుడు సైలెంటు అయిపోయారు. ఒకరూ అరా తప్పా అందరూ మెల్లగా అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. మరోవైపు తమ బినామీలను ముందస్తుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు రాజధాని గ్రామాల్లో చర్చ సాగుతోంది. ఉన్నట్టుండి తమ గ్రామాల పరిధిలో కొందరు ఫోన్‌లు స్విచాఫ్‌ చేసుకున్నారని, రెండు మూడు రోజుల నుంచి కనపడడం లేదని వారు చెబుతున్నారు. 

ముందుగా ఈడీ విచారణకు అవకాశం ఉన్న టాప్‌ 10 మందిని అజ్ఞాతంలోకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని సీఐడీ కూడా గుర్తించినట్లు సమాచారం అందుతోంది. పలువురు పెద్ద నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు స్తబ్దుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విచారణకు సంబంధించిన వార్తలు జనంలోకి వెళ్లకుండా కొన్ని మీడియా సంస్థలకు టీడీపీ అధినేత నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రజల దృష్టి మరల్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించినట్లు కొందరు మీడియా ప్రతినిధులు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే కియా వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చినట్లు చెబుతున్నారు. రానున్న వారం రోజుల్లో పలువురు మాజీ మంత్రులను విచారణకు పిలిచి ఆపై రెండు మూడు రోజుల్లో అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి