iDreamPost

అభిమానమా మూర్ఖత్వమా – గతి తప్పుతున్న ఫ్యాన్ వార్

కనీస విచక్షణ సంస్కారం మర్చిపోయేలా చేసి తమ దిగజారిన వ్యక్తిత్వాన్ని సోషల్ మీడియాలో నగ్నంగా నిలబెడుతోంది.

కనీస విచక్షణ సంస్కారం మర్చిపోయేలా చేసి తమ దిగజారిన వ్యక్తిత్వాన్ని సోషల్ మీడియాలో నగ్నంగా నిలబెడుతోంది.

అభిమానమా మూర్ఖత్వమా – గతి తప్పుతున్న ఫ్యాన్ వార్

స్టార్ హీరోల మీద అభిమానుల ప్రేమ వెర్రితలలు వేస్తోంది. కనీస విచక్షణ సంస్కారం మర్చిపోయేలా చేసి తమ దిగజారిన వ్యక్తిత్వాన్ని సోషల్ మీడియాలో నగ్నంగా నిలబెడుతోంది. నాలుగు రోజుల క్రితం రామ్ చరణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అర్థం లేని ట్రెండింగ్స్ చేసుకుని ఇక్కడ చెప్పలేని దారుణమైన ట్యాగ్స్ తో ఒకరినొకరు టార్గెట్ చేసుకున్న తీరు జుగుప్స కలిగించేలా ఉంది. ఏదో సినిమాల రికార్డుల గురించో వాటి మంచి చెడ్డల గురించి డిబేట్లు పెట్టుకుంటే ఏదోలే అనుకోవచ్చు కానీ ఏకంగా నటీనటుల కుటుంబ సభ్యులను ప్రస్తావించి వాళ్ళ మీద ట్రోలింగ్ లు, మీమ్స్ చేయడం మాత్రం దుర్మార్గమైన చర్య. వీటికి లక్షల్లో మద్దతు పలికే వాళ్ళుండటం ఇంకా పెద్ద ట్రాజెడీ

ఏ హీరో తమ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన దాఖలాలు సౌత్ లో లేవు. ఈ తలనెప్పులు పడలేకే కోలీవుడ్ స్టార్ అజిత్ తనకే అభిమాన సంఘాలు లేవని వాటిని గుర్తించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం చాలా ఏళ్ళ క్రితమే జరిగింది. అందుకే ఆయా అసోసియేషన్లు చేసే ఏ వేడుకలకూ అజిత్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించదు. తమిళనాడులో ఫ్యానిజం అతిగా ఉంటుంది కాబట్టి అజిత్ ఆ చర్య తీసుకున్నాడు. కానీ ట్విట్టర్ లో ఈ వార్ విజయ్ అజిత్ ఫ్యాన్స్ మధ్య జరుగుతూనే ఉంటుంది. ఆ మధ్య ఆర్ఆర్ఆర్ వచ్చినప్పుడు చరణ్ తారక్ ఫ్యాన్స్ రెండుగా విడిపోయి మా హీరో బాగా చేశాడంటే మా హీరో బాగా చేశాడని ఎన్నేసి పోస్టులు ట్వీట్లు పెట్టుకుని తిట్టుకున్నారో లెక్క బెట్టడం కష్టం.
Fandom or Stupidity - A Fan War That's Going Away
జనసేన పెట్టక పవన్ కళ్యాణ్ సైతం పలుమార్లు ఈ యాంటీ ఫ్యాన్స్ కు టార్గెట్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ ని లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు ఎందరో. అయితే ఈ ధోరణిని కట్టడి చేయడం అసాధ్యం. వీటిని చేసేవాళ్ళు దాదాపుగా ఫేక్ ఐడి బ్యాచే ఉంటుంది. ఎవరికీ ఒరిజినల్ ఐడెంటిటీ ఉండదు. కాకపోతే వీళ్ళ వల్ల ప్రభావితం చెంది ఈ రొంపిలోకి దిగబడుతున్న వాళ్ళు లేకపోలేదు. ఇదంతా పిఆర్ ల ద్వారా సదరు హీరోలకు తెలుస్తున్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయతే వాళ్ళది. కొందరు అభిమానులు చేసే వికృత చేష్టల వల్ల చెడ్డ పేరు మాత్రం అందరికీ ఆపాదిస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. స్వీయ నియంత్రణ తప్ప వీటి కట్టడికి ఎలాంటి మార్గాలు లేవు. లేదూ సోషల్ మీడియా అకౌంట్లకు కూడా ఆధార్ అనుసంధానం లాంటిది ఏదైనా జరిగితే తప్ప

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి