iDreamPost

వీడియో: మగాళ్ల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించండి. సీఎంకు ప్రయాణీకుడు రిక్వెస్ట్!

అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఇచ్చిన హామీలను మెచ్చి.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే.. హామీల్లో రెండింటిపై సంతకాలు చేశారు.. వాటిల్లో ఒకటి మహాలక్ష్మి పథకం..

అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఇచ్చిన హామీలను మెచ్చి.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే.. హామీల్లో రెండింటిపై సంతకాలు చేశారు.. వాటిల్లో ఒకటి మహాలక్ష్మి పథకం..

వీడియో: మగాళ్ల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించండి. సీఎంకు ప్రయాణీకుడు రిక్వెస్ట్!

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. తొలిగా రెండు హామీలపై సంతకాలు చేశారు. ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర మహిళలు, ట్రాన్స్ జెండర్లు, విద్యార్థినులు, యువతులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు పరిచారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచారు. ఇదిలా ఉంటే.. ఫ్రీ బస్సు జర్నీ అమలు చేయడంతో మహిళల నుండి విశేష ఆదరణ లభించింది. ఎక్కువ మంది మహిళలు ఈ బస్సు ప్రయాణాన్ని ఆశ్రయిస్తున్నారు.  జీరో టికెట్టుతో తమ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు.  దీంతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి.

ఇటు తెలంగాణ ఆర్టీసీ కూడా లాభాల బాట పట్టింది. ఇక ఈ పథకం కారణంగా ఆటో డ్రైవర్లు గగ్గోలు పెట్టారు. తాము ఎలా బతకాలంటూ నిరసనలు చేపట్టారు. ఇప్పుడు ఈ పథకంతో పురుషులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఓ ప్రయాణీకుడు.. తన ఆవేదనను వీడియో రూపంలో తీసి.. నెట్టింట్లో పెట్టడంతో వైరల్ అవుతుంది. మగాళ్ల కోసం ప్రత్యేకంగా సీట్లు పెట్టించండని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేశాడు. ఇంతకు ఆ వీడియోలో ప్రయాణీకుడు ఏమన్నారంటే.. ‘ హైదరాబాద్ నుండి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారూ. ఇదిగో చూడండి. డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల కావట్లేదు. సెపరేటుగా లేడీస్ కోసం బస్సులైనా వేయించండి. లేదంటే మగాళ్ల మటుకే ప్రత్యేక సీట్లు కేటాయించండి’ అంటూ వాపోయాడు.

‘బస్సు ఫుల్ టైట్ అయిపోయింది. కనీసం 70-80 కిలోమీటర్లు డబ్బులు పెట్టి పోవాలంటే మా వల్ల అయితలేదు. ఇదిగో ఈ పెద్దమనిషి 150 కిలోమీటర్లు పోవాలట. నించొని అంత దూరం పోవాలంటే కష్టమౌతుంది. లేడీస్ సీట్లు ఇవ్వరు. అడిగితే మనల్ని బద్నామ్ చేస్తారు. అవసరమైతే.. బస్సులో ఉన్న మగవాళ్లు సైతం మా పైన దాడి చేస్తారు. మా బాధలు చూడండి. ఒకసారి ఆలోచన చేయండి సీఎం సార్’ అంటూ విన్నవించాడు. ఈ పథకం వచ్చిన దగ్గర నుండి ఎక్కువ మంది మహిళలు బస్సులను ఆశ్రయిస్తున్నారు. కొన్ని బస్సుల్లో మగాళ్ల సీట్లను కూడా ఆక్రమిస్తుండటంతో పురుషులు ఇబ్బందులు పడుతున్నారు. టికెట్ కొనుగోలు చేసి వందల కిలోమీటర్లు బస్సులో నిలబడి ఎలా ప్రయాణించాలని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమస్యను మీరు ఎదుర్కొన్నట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి