iDreamPost

మంగళగిరిపై ఆశలు వదిలేసుకున్న నారా లోకేశ్! ఇది RK స్ట్రోక్!

  • Published Feb 21, 2024 | 1:55 PMUpdated Feb 21, 2024 | 1:55 PM

ఆర్కే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత.. మంగళగిరిలో కచ్చితంగా గెలుస్తానని భావించాడు లోకేష్‌. కానీ ఆఖర్లో.. చినబాబుకు ఆర్కే ఊహించని స్ట్రోక్‌ ఇచ్చాడు. ఆ వివరాలు..

ఆర్కే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత.. మంగళగిరిలో కచ్చితంగా గెలుస్తానని భావించాడు లోకేష్‌. కానీ ఆఖర్లో.. చినబాబుకు ఆర్కే ఊహించని స్ట్రోక్‌ ఇచ్చాడు. ఆ వివరాలు..

  • Published Feb 21, 2024 | 1:55 PMUpdated Feb 21, 2024 | 1:55 PM
మంగళగిరిపై ఆశలు వదిలేసుకున్న నారా లోకేశ్! ఇది RK స్ట్రోక్!

సరిగా నెల రోజుల క్రితం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. వైసీపీని వీడి.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆళ్ల నిర్ణయంపై అందరి కంటే ఎక్కువగా సంతోషించిన వ్యక్తి ఎవరంటే.. టీడీపీ నేత నారా లోకేష్‌. ఎందుకంటే 2019 ఎన్నికల్లో మంగళగిరిలో.. ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేష్‌ ఓడిపోయాడు. నాడు ఎన్నికల్లో గెలవడం కోసం లోకేష్‌ చేయని ప్రయత్నం అంటూ లేదు. అక్కడ ఎన్నాళ్లుగానో ఉన్న బీసీ అభ్యర్థి గంజి చిరంజీవిని పక్కకు పెట్టి మరీ చంద్రబాబు లోకేష్‌కి మంగళగిరి టికెట్‌ ఇచ్చాడు. రాజధాని అంశం తమకు కలిసి వస్తుందని భావించాడు. ఇక ఎన్నికల్లో గెలవడం కోసం లోకేష్‌.. భారీ ఎత్తున​ డబ్బు ఖర్చు చేశాడు. అయినా సరే ఓడిపోవాల్సి వచ్చింది.

ఇక 2024 ఎన్నికల్లో కూడా లోకేష్‌ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని ప్రకటించాడు. అయితే అక్కడ వైసీపీకే పట్టు ఎక్కువ. దానికి తోడు గంజి చిరంజీవి టీడీపీని వీడి అధికార పార్టీలో చేరడం.. ఆయనకు మంగళగిరి టికెట్‌ కన్ఫామ్‌ చేయడం జరిగింది. దాంతో మంగళగిరిలో లోకేష్‌ మరోసారి ఓడిపోవడం పక్కా అనే ప్రచారం తెర మీదకు వచ్చింది. ఇలాంటి సమయంలోనే ఆర్కే వైసీపీని వీడటం.. లోకేష్‌ నెత్తిన పాలు పోసినట్లు అయ్యింది.

ఎందుకంటే వైసీపీని వీడిన ఆర్కే.. కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. హస్తం పార్టీ టీడీపీ ప్రయోజనాల కోసం పని చేస్తుందనేది అందరికి తెలిసిన రహస్యం. దాంతో ఈసారి ఎన్నికల్లో మంగళగిరిలో తర విజయం తథ్యం అని లోకేష్‌ భావించాడు. తన విజయానికి ఆర్కే పరోక్షంగా కారణమవుతాడని లోకేష్‌ నమ్మకం పెట్టుకున్నాడు. కానీ అనుకోని విధంగా లోకేష్‌ ఆశలపై నీళ్లు చల్లారు ఆర్కే. తిరిగి ఆయన సొంత గూటికి చేరుకోవడంతో.. అందరి కన్నా ఎక్కువగా లోకేషే బాధపడుతున్నాడట.

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నెల రోజుల వ్యవధిలోనే ఆ పార్టీ విధానాలు, వైఎస్‌ షర్మిల స్వార్థం అర్థం చేసుకున్న ఆర్కే.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఫిబ్రవరి నాడు అనగా మంగళవారం రోజు జగన్‌ సమక్షంలో తిరిగి వైసీపీలో చేరాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సారి లోకేష్‌.. బీసీ చేతిలో ఓడిపోవడం ఖాయం అని ప్రకటించారు. ఇప్పటికే ఓటమి భయంలో ఉన్న లోకేష్‌ని ఈ వ్యాఖ్యలు మరింత భయపెడుతున్నాయి అంటున్నారు రాజకీయ పండితులు.

2019 ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి లోకేష్‌ పోటీ చేయగా వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి గంజి శ్రీనివాస్‌ బరిలో దిగనున్నారు. ఈయన 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి.. వైసీపీ అభ్యర్థి ఆర్కే చేతిలో ఓడిపోయారు. ఈ క్రమంలో తాజాగా ఆయన టీడీపీ నుంచి వైసీపీలో చేరి.. మంగళగిరి సీటు దక్కించుకున్నారు. ఇక ఈ నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇక్కడ బీసీ ఓటర్లే అధికం.

మంగళగిరిలో మొత్తం 2.68 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 55 వేల మందికిపైగా పద్మశాలీలు ఉన్నారు. మాదిగ సామాజికవర్గ ఓటర్లు 35 వేల మంది.. మాల వర్గానికి చెందిన ఓటర్లు 28 వేల మంది ఉన్నారు. కాపు సామాజిక వర్గం ఓటర్లు 30 వేల మంది ఉండగా.. కమ్మ సామాజికవర్గ ఓటర్లు 17 వేల మంది ఉన్నారు. సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని జగన్‌.. మంగళగిరి నుంచి గంజి చిరంజీవిని బరిలో దింపుతున్నారు. ఇటు క్యాస్ట్‌, అటు పార్టీ రెండు రకాలుగా కలిసి వస్తుందనే ఉద్దేశంతోనే జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆర్కే కూడా వైసీపీకి తిరిగి రావడంతో.. గంజి చిరంజీవి విజయం మరింత సులభమయ్యింది అంటున్నారు రాజకీయపండితులు. దాంతో మంగళగిరిపై లోకేష్‌ పెట్టుకున్న ఆశలు పోయినట్లే అంటున్నారు. మరి లోకేష్‌కు ఆర్కే ఇచ్చిన స్ట్రోక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి