iDreamPost

ఇండియన్ సినిమాపై ఆస్ట్రేలియా బాంబు

ఇండియన్ సినిమాపై ఆస్ట్రేలియా బాంబు

అనుకున్నదాని కన్నా భయంకరంగా మారుతున్నాయి కొవిడ్ 19 తాలూకు పరిణామాలు. నిన్న రెండు తెలుగు రాష్ట్రాలు ఏకంగా లాక్ డౌన్ ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇటలీలో మరణాలు తీవ్రంగా ఉండగా అమెరికాలోనూ వ్యాధి క్రమంగా పెరుగుదల చూపిస్తోంది. పైకి మార్చి 31 దాకా అన్ని బంద్ అని చెప్పుకుంటున్నాం కానీ అది పొడిగించబడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లోని అధిక దేశాల్లో థియేటర్లు మూతబడగా తాజాగా ఆస్ట్రేలియా కూడా ఆ దిశగా అడుగులు వేసింది.

ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయమేంటి అని అనుమాన పడుతున్నారా. మ్యాటర్ వేరే ఉంది. ఇక్కడంతా ఏప్రిల్ కంతా సినిమాలు రిలీజవుతాయని ఆశిస్తున్నాం కానీ ఆస్ట్రేలియాలో మాత్రం మల్టీ ప్లెక్స్ స్క్రీనింగ్ మేనేజ్మెంట్స్ మే చివరి దాకా ఆ ఛాన్స్ లేదని తేల్చి చెప్పేస్తున్నాయి. ఒకవేళ ప్రపంచంలో ఇతర దేశాల్లో కొత్త సినిమాలు వచ్చినా ఆస్ట్రేలియాలో మాత్రం ప్రదర్శనకు నోచుకోవు. అధికశాతం యుఎస్, దుబాయ్ లాంటి మార్కెట్ల మీద ఆధారపడే టాలీవుడ్ కు ఇది ఎక్కువ ప్రభావం చూపించకపోయినా బాలీవుడ్ కు గట్టి దెబ్బ పడుతుంది.

ఇప్పటికే సూర్యవంశీ లాంటి భారీ మల్టీ స్టారర్ మొదలుకుని అక్షయ్ కుమార్ లక్స్మీ బాంబ్ దాకా ఎన్నో రీ షెడ్యూల్ చేయాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు తేదీలు డిసైడ్ చేయలేని సిచువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రకటించిన మే ఎండింగ్ షట్ డౌన్ చర్య ఇతర దేశాల నుంచి కూడా ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. ఏ దేశమూ రాజీ పడే స్టేజిలో లేదు. దానికి తోడు జనం సినిమాలు చూసే మూడ్ లో అస్సలు లేరు. చూస్తుంటే ఏప్రిల్ మొత్తం ఇంట్లోనే హోమ్ ఎంటర్ టైన్మెంట్ మీద ఆధారపడక తప్పేలాలేదు. అప్పటిదాకా కరోనా మహమ్మారి వెళ్ళిపోవాలని దేవుడుని వేడుకోవడం తప్ప నిర్మాతలు, ప్రేక్షకులు చేసేదేమీ లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి