iDreamPost

Ayodhya Ram Mandir: అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట.. నూతన భారతావనికి నాంది: చీఫ్ ఇమామ్

అయోధ్యలో అపురూప ఘట్టం ఆవిష్కతమైంది. ఆ రామయ్య ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా పూర్తైంది. ఈ సందర్భంగా చీఫ్ ఇమామ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అయోధ్యలో అపురూప ఘట్టం ఆవిష్కతమైంది. ఆ రామయ్య ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా పూర్తైంది. ఈ సందర్భంగా చీఫ్ ఇమామ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Ayodhya Ram Mandir: అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట.. నూతన భారతావనికి నాంది: చీఫ్ ఇమామ్

అయోధ్య రామాలయం.. గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఈ అద్భుత ఘట్టం కోసం అందరూ ఎదురచూశారు. ఆ అపూర్వ ఘట్టం అంగరంగవైభవంగా పూర్తైంది. ప్రపంచంవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు అంతా పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. కోట్ల మంది భక్తులు ఈ ఘట్టాన్ని వీక్షించి ఉద్వేగానికి లోనయ్యారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ బాలరాముడి గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా పలు భావోద్వేగ, ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. వాటిలో ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ డాక్టర్ ఉమర్ అహ్మద్ ఇలియాజీ వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి.

భారతదేశంలో మాత సామర్యానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడ కులం, మతం, వర్గం, వర్ణం కన్నా కూడా మానవత్వం, స్నేహం, వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే భారతదేశంలో హిందూముస్లిం అన్నదమ్ములుగా కలిసి మెలిసి మెలుగుతారు. ఇప్పుడు చీఫ్ ఇమామ్ వ్యాఖ్యలు కూడా వాటికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. చీఫ్ ఇమామ్ మాట్లాడుతూ.. ఈ అపూర్వ ఘట్టం నూతన భారతావనికి నాంది అంటూ వ్యాఖ్యానించారు. మనకు మానవత్వమే అతిపెద్ద మతంగా ఆయన అభివర్ణించారు. తమకి దేశమే ప్రధానం అంటూ చీఫ్ ఇమామ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టిటం వైరల్ అవుతున్నాయి.

This is the beginning of a new India

ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ మాట్లాడుతూ “మారుతున్న భారతావనికి ఇది ఒక ఉదాహరణ. ఇది సరికొత్త బారతదేశం, నాతో ఉన్న ఈ స్వామిజీ పేరు కూడా భారత్. మేము చేసే పూజలు, వాటి విధానాలు వేరు కావచ్చు. కానీ, మన ధర్మం ఏదైతే ఉందో అది మాత్రం మానవాళికి మేలు చేసేదే అవుతుంది. రెండోది మనం అందరం భారతీయులం. ఈ క్షణం కోసం చాలానే యుద్ధాలు జరిగాయి, చాలామంది ప్రాణాలు పోయాయి. ఇప్పుడు భారతీయులు అందరం ఒక్కటై ఈ నూతన భారతావనిని ముందుకు నడిపించాలి. ఈరోజు ఎలాగైతే ప్రధాని మోదీ దేశం మొత్తం తరఫున నేతృత్వం వహిస్తునారో.. మనం కూడా అందరం కలిసి ఈ మహత్కార్యాన్ని జయప్రదం చేయాలి” అంటూ ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమెర్ అహ్మద్ ఇలియాజీ వ్యాఖ్యానించారు. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చీఫ్ ఇమామ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చీఫ్ ఇమామ్ సరిగ్గా చెప్పారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా, మత సామరస్యానికి ప్రతీకగా అభివర్ణించడానికి ఇంతకన్నా ఏం కావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి