iDreamPost

ఇతనికి నైట్రోజెన్ తో మరణశిక్ష! చరిత్రలో మొదటిసారి!

First Nitrogen Hypoxia sentence: చరిత్రలోనే తొలి నైట్రోజన్ హైపోక్సియా మరణశిక్ష అమలు కాబోతోంది. ఐక్యరాజ్య సమితి దానిని అమానవీయ శిక్షగా అభివర్ణించింది.

First Nitrogen Hypoxia sentence: చరిత్రలోనే తొలి నైట్రోజన్ హైపోక్సియా మరణశిక్ష అమలు కాబోతోంది. ఐక్యరాజ్య సమితి దానిని అమానవీయ శిక్షగా అభివర్ణించింది.

ఇతనికి నైట్రోజెన్ తో మరణశిక్ష! చరిత్రలో మొదటిసారి!

సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా నేరాలు చేసే వారికి కఠిన కారాగార శిక్షలు విధించడం పరిపాటి. అయితే వాళ్లు చేసే నేరాలను బట్టి వారికి మరణశిక్ష కూడా విధించవచ్చు. భారతదేశంలో అయితే మరణదండన అంటే ఉరితీసి శిక్షిస్తారు. కానీ, విదేశాల్లో మాత్రం వారు చేసిన నేర తీవ్రతను బట్టి రకరకాల మరణశిక్షలు విధిస్తూ ఉంటారు. అవి కొన్నిసార్లు క్రూరంగా కూడా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తికి అత్యంత దారుణమైన మరణశిక్షను విధించారు. నైట్రోజన్ తో అతడికి మరణశిక్ష విధించారు. అసలు నైట్రో హైపోక్సియా అంటే ఏంటి? అసలు అతను చేసిన నేరం ఏంటో చూద్దాం.

ఈ ఖైదీ పేరు కెన్నెత్ యూజీన్ స్మిత్. ఇతను 1988నాటి హత్య కేసులో దోషిగా తేలాడు. అందుకే అతనికి అలబామా కోర్టు నైట్రో హైపోక్సియాతో మరణ శిక్ష విధించింది. జనవరి 25 అంటే గురువారంనాడు యూజీన్ స్మిత్ కు నైట్రోజెన్ హైపోక్సియాతో మరణశిక్ష విధించనున్నారు. అయితే ఈ శిక్షను అత్యంత అమానవీయమైన దండనగా ఐక్యరాజ్య సమితి ఓ ప్రకటనలో చెప్పింది. అయితే యూజీన్ కి మరణదండన విధించడం ఇదే తొలిసారి కాదు. అతను గతంలో ఒకసారి చావు అంచుల దాకా వెళ్లి తిరిగి వచ్చాడు. అతనికి గతంలో అత్యంత ప్రమాదకరమైన విషంతో మరణశిక్ష విధించారు.

అది మొత్తం రెండు డోసులు వేయాల్సి ఉంటుంది. 2022లో ఆ శిక్షను అమలు చేసేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు. యూజీన్ స్మిత్ ని మంచానికి కట్టేశారు. అతని కాళ్లు, చేతులు కదలకుండా పకడ్బందీగా బందించారు. ఆ మంచాన్ని శిక్ష అమలు చేసే గదికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి ఆ ఇంజెక్షన్ ఒక డోసు ఇవ్వగానే విలవిల్లాడిపోయాడు. నిర్దిష్ట సమయంలోనే రెండో డోసు కూడా ఇవ్వాలి. అలా అయితేనే ఆ విషం పనిచేస్తుంది. అలా సరైన టైమ్ కి వైద్యులు యూజీన్ స్మిత్ కి రెండో డోసు ఇవ్వలేకపోయారు. అలా తప్పని పరిస్థితుల్లో పోలీసులే అతడిని ఆస్పత్రిలో చేర్పించి ప్రాణం కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే కోర్టు ఇప్పుడు ఇలాంటి ఒక మరణశిక్షను విధించింది.

నైట్రోజన్ హైపోక్సియా అంటే?:

అందరూ ఇప్పుడు అసలు ఈ నైట్రోజన్ హైపోక్సియా అంటే ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. నైట్రోజన్ వాయువు రంగు, రుచి లేనిది. అది మన శరీరానికి మంచిది కూడా కాదు. కానీ, మనం పీల్చే గాలిలో 78శాతం నైట్రోజన్ ఉంటుంది. మనం సరైన మోతాదులో ఆక్సిజన్ తో కలిపి నైట్రోజన్ ను పీల్చినప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, నైట్రోజన్ మోతాదు ఎక్కువగా ఉంటే మాత్రం.. ప్రాణాపాయం కూడా రావచ్చు. ఇప్పుడు అలాంటి ఒక మరణశిక్షనే కెన్నత్ యూజీన్ స్మిత్ కు విధించబోతున్నారు. అతడిని ఒక గదిలో బంధిచింది. అతని చేత 100 శాతం స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును పీల్చేలా చేస్తారు. ఇలా చేయడం వల్ల అతను మరణిస్తాడు. అమెరికాలోని ఓక్లహోమా, మిస్సిసిపీ రాష్ట్రాల్లో ఈ తరహా శిక్ష అమలులో ఉంది. ఇప్పుడు అలబామాలో కూడా ఈ శిక్షను అమలు చేయబోతున్నారు. అయితే ఇలాంటి ఒక శిక్షను ఎదుర్కోబోతున్న తొలి ఖైదీ కెన్నెత్ యూజీన్ స్మిత్.

అసలు ఇతను చేసిన నేరం ఏంటంటే.. ఎలిజబెత్ సెనెట్ అనే మహిళ భర్త ఒక మత బోధకుడు. అతను బాగా అప్పుల్లో కూరుకుపోయాడు. వాటి నుంచి ఎలా బయటపడాలో అతనికి అర్థం కాలేదు. అందుకని ఒక ఘోరమైన పథకాన్ని రచించాడు. తన భార్య పేరిట ఒక ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు కిరాయి గూండాలను మాట్లాడాడు. ఇద్దరికీ చెరికో లక్ష ముట్టజెప్పాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు గూండాలు ఎలిజబెత్ సెనెట్ ను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆ హత్య చేసిన కిరాయి గూండాల్లో కెన్నెత్ యూజీన్ స్మిత్ కూడా ఒకడు. ఇప్పుడు అతని నేరం రుజువు కావడంతో అతనికి అత్యంత దారుణంగా నైట్రోజన్ హైపోక్సియా ద్వారా మరణ శిక్షను విధించారు. మరి.. కెన్నెత్ యూజీన్ స్మిత్ కు విధించిన శిక్షపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి