iDreamPost

Akhanda : బాలయ్య నాన్ స్టాప్ వసూళ్ల ప్రభంజనం

Akhanda : బాలయ్య నాన్ స్టాప్ వసూళ్ల ప్రభంజనం

కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని నాలుగు రోజుల వీకెండ్ వచ్చేలా చూసుకున్న బాలకృష్ణ అఖండ దాన్ని అంచనాలకు మించి వాడేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సరైన మాస్ సినిమా వచ్చి నెలలు గడిచిపోయాయన్న కొరతను పూర్తిగా తీరుస్తూ నైజాంతో సహా చాలా ప్రాంతాల్లో నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ చేరుకున్నట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా నిన్న ఎన్నో కేంద్రాల్లో ఎక్స్ ట్రా షోలు, మరక్కార్-స్కై ల్యాబ్ లాంటి వాటిని అఖండతో రీ ప్లేస్ చేయడం లాంటివి జరిగాయని అఫ్ ది రికార్డు డిస్ట్రిబ్యూటర్ల మాటలను బట్టి తెలుస్తోంది. ఇవాళ సోమవారం నుంచి సహజంగానే డ్రాప్ ఉంటుంది కాబట్టి అది ఏ స్థాయిలో అనేది వేచి చూడాలి.

మొత్తం నాలుగు రోజులకు గాను అఖండ 45 కోట్ల షేర్ కు దగ్గరగా వెళ్లి మతిపోయే రికార్డులను సొంతం చేసుకుంది. ఇది గత అయిదు నెలల కాలంలో ఏ సూపర్ హిట్ కు ఫుల్ రన్ లోనూ సాధ్యం కానీ ఫీట్. మూడు డిజాస్టర్ల తర్వాత కూడా బాలయ్య మేనియా ఈ రేంజ్ లో ఉండటం చూసి పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా డిసెంబర్ ని పెద్ద సినిమాలకు అంత అనుకూలమైన సీజన్ గా భావించరు. అలాంటిది ఈ టైంలోనూ అఖండ కలెక్షన్లు షాక్ ఇచ్చేవే. అనూహ్యంగా నగరాల్లోనూ ఫిగర్స్ బిసి సెంటర్స్ తో పోటీ పడుతుండటం గమనార్హం. అనధికార సమాచారం మేరకు ఏరియాల వారిగా వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజామ్ – 12 కోట్ల 10 లక్షలు
సీడెడ్ – 9 కోట్ల 80 లక్షలు
ఉత్తరాంధ్ర – 3 కోట్ల 74 లక్షలు
ఈస్ట్ గోదావరి – 2 కోట్ల 61 లక్షలు
వెస్ట్ గోదావరి – 2 కోట్ల 4 లక్షలు
గుంటూరు – 3 కోట్ల 26 లక్షలు
కృష్ణా – 2 కోట్ల 27 లక్షలు
నెల్లూరు – 1 కోటి 70 లక్షలు

ఏపి/తెలంగాణ నాలుగు రోజుల షేర్ – 37 కోట్ల 52 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా – 3 కోట్ల 25 లక్షలు
ఓవర్సీస్ – 4 కోట్ల 4 లక్షలు

ప్రపంచయవ్యాప్తంగా 4 రోజుల షేర్ – 44 కోట్ల 81 లక్షలు

ఇంకో ఏడెనిమిది కోట్లు తెచ్చేస్తే ఈజీగా లాభాల్లోకి ప్రవేశిస్తుంది అఖండ. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే అదేమీ అసాధ్యం కాదు. గ్రాస్ లెక్కలో 73 కోట్లు రాబట్టిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే టాప్ 1గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సింహా లెజెండ్ లను మించేలా ఫైనల్ ఫిగర్ క్లోజ్ కావొచ్చని అంటున్నారు. ఈ వారం లక్ష్య ఒక్కటే కాస్త చెప్పుకోదగిన రిలీజ్. కానీ అది మాస్ ఎంటర్ టైనర్ కాదు కాబట్టి అఖండకు వచ్చిన ఇబ్బందేమీ లేదు 17న పుష్ప థియేటర్లలో అడుగు పెట్టే దాకా అఖండ డామినేషన్ కి ఆపడం జరగదు. వంద కోట్ల గ్రాస్ చేరుతుందా లేదా అనే అంచనాలకు సమాధానం దొరకాలంటే ఇంకొంత కాలం ఆగాలి

Also Read : Mahesh Babu : మహేష్ సేఫ్ గేమ్ లెక్కలు ఇవే.. మారాల్సింది ఆడియన్సే మరి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి