iDreamPost

Rahmanullah Gurbaz: అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట.. భక్తి పారవశ్యంలో ఆఫ్ఘాన్ క్రికెటర్!

  • Published Jan 25, 2024 | 8:28 AMUpdated Jan 25, 2024 | 8:28 AM

అయోధ్య భవ్య మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆఫ్ఘానిస్థాన్ స్టార్ క్రికెటర్ భక్తి పారవశ్యంలో మునిగిపోయాడు.

అయోధ్య భవ్య మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆఫ్ఘానిస్థాన్ స్టార్ క్రికెటర్ భక్తి పారవశ్యంలో మునిగిపోయాడు.

  • Published Jan 25, 2024 | 8:28 AMUpdated Jan 25, 2024 | 8:28 AM
Rahmanullah Gurbaz: అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట.. భక్తి పారవశ్యంలో ఆఫ్ఘాన్ క్రికెటర్!

అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. భక్తుల వందల ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భవ్య రామమందిరం మళ్లీ ప్రారంభమైంది. బాలరాముడి సాధారణ దర్శనాలు కూడా మొదలయ్యాయి. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దేశం మొత్తం గ్రాండ్​గా జరుపుకుంది. ఇళ్లలో దీపాలు వెలిగిస్తూ, పూజలు చేస్తూ అంతా రామనామాన్ని జపించారు. జాతి మొత్తాన్ని ఐక్యం చేసిన ఘట్టంగా ఇది దేశ చరిత్రలో నిలిచిపోయింది. అయితే అయోధ్యలో రాముడు కొలువుదీరిన వేళ అంతర్జాతీయ క్రికెటర్లు కూడా నెట్టింట రియాక్ట్ అవుతున్నారు. రామయ్య మీద తమ భక్తిని చాటుకుంటున్నారు. ఆఫ్ఘానిస్థాన్ స్టార్ క్రికెటర్ రెహ్మానుల్లా గుర్బాజ్ అయితే శ్రీరాముడి భక్తిపారవశ్యంలో మునిగిపోయాడు. రాముడు తమ ఇంటికొచ్చాడని తెలిపాడు.

అయోధ్యలోని భవ్య మందిరంలో బాలరాముడు కొలువుదీరడంతో తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు గుర్బాజ్. తన ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో ఓ సెల్ఫీని పోస్ట్ చేసిన ఈ కోల్​కతా నైట్​రైడర్స్ ఓపెనర్.. దానికి బ్యాగ్రౌండ్​లో ఓ పాటను జోడించాడు. ఇండియన్ పాపులర్ సింగర్ జుబిన్ నౌటియాల్ ఆలపించిన ‘మేరా ఘర్ రామ్ ఆయే హై’ పాటను ఆ ఫొటోకు యాడ్ చేశాడు గుర్బాజ్. అతడి ఇన్​స్టా స్టోరీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ రాముడి మీద ఉన్న భక్తిని గుర్బాజ్ చాటుకున్నాడని అంటున్నారు. అతడు పోస్ట్ చేసిన సాంగ్​ లిరిక్స్​కు అర్థం రాముడు తన ఇంటికొచ్చాడని.. తద్వారా తన మనసులో ఆయన మీద ఉన్న ప్రేమ, భక్తి, గౌరవాన్ని గుర్బాజ్ అందరికీ తెలియజేశాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఆఫ్ఘాన్ క్రికెటర్​కు శ్రీరాముడి ఆశీస్సులు ఉంటాయని.. అతడు మరింత చెలరేగి ఆడతాడని ఆశిస్తున్నామని చెబుతున్నారు.

రెహ్మానుల్లా గుర్బాజ్​తో పాటు మరికొంత మంది ఇంటర్నేషనల్ స్టార్స్ రాముడి మీద తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ జై శ్రీరామ్ అంటూ తన ఇన్​స్టాగ్రామ్​లో స్టోరీ పెట్టాడు. మూడు నామాల బొట్టుతో ఉన్న తన ఫొటోను అతడు నెట్టింట షేర్ చేశాడు. దీంతో అది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంపై రియాక్ట్ అయ్యాడు. తన ఇన్​స్టా అకౌంట్​లో ‘జై శ్రీరామ్ ఇండియా’ అంటూ పోస్ట్ పెట్టి విషెస్ చెప్పాడు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాల మీద గతంలోనూ డేవిడ్ భాయ్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్​ కనేరియా కూడా స్పందించాడు. శతాబ్దాల నిరీక్షణ ముగిసిందని.. ప్రతిజ్ఞ నెరవేరిందని ట్విట్టర్​లో ఓ పోస్ట్ పెట్టాడు. మరి.. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టార్స్ రామాలయంపై స్పందించడం మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి