iDreamPost

ఆఫ్గాన్ యోధుడి కథ.. తల్లి మరణాన్ని దిగమింగి వరల్డ్ కప్ హీరోగా..

  • Author Soma Sekhar Published - 08:14 PM, Sat - 4 November 23

పసికూన అనే పిలుపు నుంచి.. ప్రపంచ దేశాలను వణికించే స్థాయికి చేరింది ఆఫ్గానిస్థాన్. దాని వెనక ఓ యోధుడి పోరాటం ఉంది. తల్లి మరణాన్ని దిగమింగుకుని జట్టును విజయాల వైపు తీసుకెళ్తున్న ఆఫ్గాన్ సారథి హష్మతుల్లా షాహిది లైఫ్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం.

పసికూన అనే పిలుపు నుంచి.. ప్రపంచ దేశాలను వణికించే స్థాయికి చేరింది ఆఫ్గానిస్థాన్. దాని వెనక ఓ యోధుడి పోరాటం ఉంది. తల్లి మరణాన్ని దిగమింగుకుని జట్టును విజయాల వైపు తీసుకెళ్తున్న ఆఫ్గాన్ సారథి హష్మతుల్లా షాహిది లైఫ్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 08:14 PM, Sat - 4 November 23
ఆఫ్గాన్ యోధుడి కథ.. తల్లి మరణాన్ని దిగమింగి వరల్డ్ కప్ హీరోగా..

ఆఫ్గాన్ ప్రజల ముఖాల్లో నవ్వు చూడాలన్నది తండ్రి లక్ష్యం.. తాను ఆడే జట్టుకు విజయాలు అందించాలనేది తల్లి ధ్యేయం. ఈ రెండింటి కోసం అలుపెరగని యుధ్దం చేస్తున్నాడు ఓ యోధుడు. కానీ ఆ యుద్దంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టనష్టాలు, గుండెలు పగిలే విషాదాలు. అయితే ఇవేవీ ఆ సైనికుడి పోరాటాన్ని అడ్డుకోలేకపోయాయి. అతడి ఆత్మవిశ్వాసం, పట్టుదల, అకుంఠిత దీక్ష ముందు సమస్యలన్నీ మోకరిల్లాయి. ఈ సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఓ పెను విషాదం తన జీవితంలో చోటుచేసుకుంది. తొలుత తండ్రి మరణం.. ఆ వెంటనే తల్లి మరణంతో ఆ పోరాట యోధుడు కుంగిపోయాడు. కానీ తన యుద్ధాన్ని మాత్రం ఆపలేదు. తల్లి మరణాన్ని దిగమింగి.. వరల్డ్ కప్ హీరోగా వెలుగొందుతున్న ఆ సైనికుడు ఎవరో కాదు.. ఆఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు సారథి హష్మతుల్లా షాహిది.

హష్మతుల్లా షాహిది.. తండ్రి మహ్మద్ హషీమ్ ఫిజిక్స్ ప్రొఫెసర్. తన కొడుకును పెద్ద సైటింస్ట్ చేయాలనేది అతడి కోరిక. కానీ అతడికి మాత్రం క్రికెటర్ అవ్వాలని ఉండేది. దీంతో అటువైపుగా అడుగులు వేశాడు. దేశవాళీ క్రికెట్ లో మ్యాచ్ లు ఆడుతున్న సమయంలోనే తన తండ్రిని కోల్పోయాడు. 2018లో హషీమ్ మరణించాడు. ఈ బాధను దిగమింగుకుని 2019 వరల్డ్ కప్ లోకి అడుగుపెట్టింది ఆఫ్గాన్. దీని వెనక హష్మతుల్లా కృషి వెలకట్టలేనిది. ఇక ఈ ఏడాదే ఆఫ్గాన్ కు టెస్ట్, వన్డే కెప్టెన్ గా నియమితుడైయ్యాడు హష్మతుల్లా. అప్పటి నుంచి ఆఫ్గాన్ జట్టు స్థితిగతులే మారిపోయాయి. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్న సమయంలో ఈ ఏడాది ఆగస్టులో షాహిది తల్లి అనారోగ్యం బారినపడి మరణించింది. ఈ సంఘటనతో హష్మతుల్లా తీవ్రగా కుంగిపోయాడు.

మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభం అవుతుండగా.. ఈ పెను విషాదం హష్మతుల్లాను కోలుకోకుండా చేసింది. కానీ తల్లిదండ్రుల కోరికను తీర్చడం కోసం.. వారి మరణాన్ని దిగమింగుకుని వరల్డ్ కప్ లోకి అడుగుపెట్టింది ఆఫ్గాన్. కెప్టెన్ గా అద్భుతమైన ప్లాన్స్ వేస్తూ.. ఈ మెగాటోర్నీలో సంచలనాలు నమోదు చేశాడు షాహిది. ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంకలకు షాకిచ్చి.. తాజాగా నెదర్లాండ్స్ ను ఓడించి సెమీస్ రేస్ లో నిలిచింది. ఆఫ్గాన్ విజయాల వెనక సారథి హష్మతుల్లా మెుక్కవోని పట్టుదల ఉంది. అటు సారథిగా జట్టును ముందుండి నడిపించడంతో పాటుగా.. బ్యాటర్ గా దుమ్మురేపుతున్నాడు.

ఈ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో వరుసగా.. 18, 80, 14, 8, 48*, 58*, 56* పరుగులు సాధించాడు. ఇందులో భారత్ పై 80 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 70.50 సగటుతో 282 రన్స్ చేసి ఆఫ్గాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అదీకాక ఒకే ప్రపంచ కప్ లో అత్యధిక రన్స్ చేసిన ఆఫ్గాన్ ప్లేయర్ గా కూడా రికార్డు సృష్టించాడు. తాజాగా నెదర్లాండ్స్ పై సాధించిన విజయాన్ని తమ దేశ శరణార్థులకు అంకితమిచ్చి.. గొప్ప మనసు చాటుకున్నాడు. మరి తల్లి మరణాన్ని దిగిమింగి.. ఈరోజు(నవంబర్ 4) పుట్టినరోజు జరుపుకుంటూ.. వరల్డ్ కప్ లో హీరోలా దూసుకెళ్తున్న ఆఫ్గాన్ సారథి హష్మతుల్లాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి