iDreamPost

Aadudam Andhra: నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ ఫైనల్‌ మ్యాచ్‌లు.. పూర్తి వివరాలు!

గ్రామీణ స్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఆడుదాం.. ఆంధ్ర అనే కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాలుగు దశలో విజయం సాధించిన జట్లకు నేటి నుంచి ఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

గ్రామీణ స్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఆడుదాం.. ఆంధ్ర అనే కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాలుగు దశలో విజయం సాధించిన జట్లకు నేటి నుంచి ఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Aadudam Andhra: నేటి నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ ఫైనల్‌ మ్యాచ్‌లు.. పూర్తి వివరాలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇలా కేవలం ఒక వర్గం, ఒక వయస్సు వారినే కాకుండా అందరికీ కోసం వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా యువతలో, విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రొగ్రామ్..‘ఆడుదాం.. ఆంధ్రా’.  గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో ఈ పోటీలు నిర్వహించారు. గ్రామీణస్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ‘ఆడుదాం ఆంధ్రా’తుది ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మహా సంగ్రామం జరగనుంది. మరి.. ఈ మహా సంగ్రామంకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గ్రామీణ యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఏపీ ప్రభుత్వం ‘ఆడుదాం.. ఆంధ్రా’ అనే క్రీడా సంగ్రామానికి తెరలేపిన సంగతి తెలిసిందే. నాలుగు దశల్లో నిర్వహించిన వివిధ రకాల ఆటల పోటీలకు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలకు మంచి స్పందన వచ్చింది. ఇక ప్రస్తుతం జిల్లా స్థాయిలో స్తతా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. నేటి నుంచి ఈ ఫైనల్ సంగ్రామం ప్రారంభం కానుంది.

శుక్రవారం విశాఖ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్ లను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించనున్నారు. అలానే చివరి రోజైన 13వ తేదీన ముగింపు వేడుకలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. కాగా చైన్నె సూపర్‌ కింగ్స్‌, ప్రో కబడ్డీ జట్లకు శిక్షణాపరమైన సహకారం అందించిన నిపుణులు ఈ పోటీలను వీక్షించేందుకు రానుండటం విశేషం. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్లేయర్లను ఎంపిక చేసి, వీరితో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. జిల్లా స్థాయిలో విజయం సాధించిన జట్లు ఇప్పటికే వైజాగ్ చేరుకున్నాయి. ప్రతీ జిల్లా నుంచి 134 మంది చొప్పున పురుషులు, మహిళలు పోటీలకు హాజరు కానున్నారు. మరికొందరు రైళ్లు, బస్సుల్లో విశాఖలో ఏర్పాటు చేసిన బస కేంద్రాలకు చేరుకున్నారు.

రైళ్లలో వచ్చిన వారి కోసం ప్రభుత్వం బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటి ద్వారా ప్లేయర్లను బస వద్దకు చేర్చారు.  అదే విధంగా 5 రోజుల పాటు క్రీడాకారులను బస ప్రాంతం నుంచి క్రీడా ప్రాంగణాల వద్దకు తరలించేందుకు 40 ప్రత్యేక బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు.ఇక వైజాగ్ లో  పురుషుల బృందాలకు దబ్బంద, మహిళ జట్లకు సుద్దగెడ్డ, కొమ్మాదిలోని టిడ్కో గృహాల్లో వసతి సౌకర్యం కల్పించారు. వుమెన్స్ కి  ఏర్పాటు చేసిన బస వద్ద జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ పర్యవేక్షణలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. అలానే బస కేంద్రాల వద్దనే అల్పాహారం, రాత్రి భోజనం అందిస్తారు. మధ్యాహ్నం భోజనం క్రీడా మైదానంలో ఏర్పాటు చేయనున్నారు. వసతి ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. మొబైల్‌ టాయిలెట్లు సిద్ధం చేశారు.

రాష్ట్ర స్థాయిలో పోటీ పడేందుకు 1,482 మంది మెన్,1,482 మంది వుమెన్స్ విశాఖ తరలి వెళ్లారు. పోటీలకు నగరంలోని క్రీడా మైదానాలను సిద్ధం చేశారు. వుమెన్‌ క్రికెట్‌ వైఎస్సార్‌ బీ గ్రౌండ్‌, మెన్‌ క్రికెట్‌ కోసం రైల్వే స్టేడియం, ఏఎంసీ మైదానాన్ని సిద్ధం చేశారు. కబడ్డీ, ఖోఖో ఏయూ గోల్డెన్‌ జూబ్లీ మైదానం, వాలీబాల్‌ ఏయూ సిల్వర్‌ జూబ్లీ  గ్రౌండ్ ను ఏర్పాటు చేశారు. అలానే బ్యాడ్మింటన్ కోసం జీవీఎంసీ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశారు. ప్రతి క్రీడలో ప్రథమ, ద్వితీయ, తృతియ బహుమతులు ప్రధానం చేయనున్నారు. మరి.. ఆడుదాం.. ఆంధ్రా మహాసంగ్రామానికి ఏపీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయేండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి