iDreamPost

థియేటర్ల నెత్తిన మరో పిడుగు.. మరింత పెరగనున్న ధరలు!

  • Published Jul 08, 2023 | 5:42 PMUpdated Jul 08, 2023 | 5:42 PM
  • Published Jul 08, 2023 | 5:42 PMUpdated Jul 08, 2023 | 5:42 PM
థియేటర్ల నెత్తిన మరో పిడుగు.. మరింత పెరగనున్న ధరలు!

కరోనా తర్వాత సినిమాలు చూసే విధానం మారింది. కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా జనాలు ఓటీటీకి అడిక్ట్‌ అయ్యారు. మరోవైపు టికెట్‌ ధరలు మొదలు.. స్నాక్స్‌, పార్కింగ్‌ ఛార్జీల వరకు ప్రతి దాని ధరలు విపరీతంగా పెరిగాయి. దాంతో జనాలు థియేటర్‌కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. సింగిల్‌ స్క్రీన్‌ల మాట అలా ఉంచితే.. మల్టీప్లెక్స్‌లో టికెట్‌ ధరలు, స్నాక్స్‌ రేట్లు.. విపరీతంగా పెరిగాయి. కుటుంబంలోని నలుగురు సభ్యులు మల్టీప్లెక్స్‌కు వెళ్లి సినిమా చూడాలంటే.. ఎంత లేదన్న 3000-4000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కోక్‌, పాప్‌ కార్న్‌ ధరలు.. బయటి మార్కట్‌తో పోలిస్తే.. మల్టీప్లెక్స్‌లలో సుమారు పది రెట్లు ఎక్కువగా ఉన్నాయి. దాంతో జనాలు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఓటీటీల హవా, అధిక ధరల భారంతో ప్రేక్షకులు లేక వెలవెలబోతున్న థియేటర్ల నెత్తిన మరో పిడుగు పడింది.

సినిమా థియేటర్లలో విక్రయించే స్నాక్స్‌, పాప్‌ కార్న్‌, కూల్‌ డ్రింక్స్‌ ధరలను మరింత పెంచాలని జీఎస్‌టీ ఫిట్ మెంట్ కమిటీ ప్రతిపాదించింది. దేశవ్యాప్తంగా సినిమా హాళ్లలో విక్రయింటే ఆహారం ,పానీయాలపై అదనంగా 5శాతం జీఎస్టీ విధించాలని కమిటీ ప్రతిపాదించింది. ఇప్పటికే అధిక ధరలతో సతమతమవుతోన్న థియేట్రికల్ మార్కెట్‌పై ఈ నిర్ణయం అదనపు భారాన్ని మోపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అధిక ధరల కారణంగా థియేటర్‌కు వెళ్లాలంటనే భయపడుతున్న ప్రేక్షకులు.. తాజా నిర్ణయం కారణంగా అసలు అటు వైపు చూసే ధైర్యం కూడా చేయరు.. ఇది థియేటర్‌ వ్యాపారంపై భారీ ప్రభావం చూపనుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సినిమా థియేటర్లలో అమ్మే స్నాక్స్‌ రేట్ల విషయంలో సామాన్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. తాజా నిర్ణయం.. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారనుంది అంటున్నారు.

సినిమా థియేటర్లలో అమ్మే కూల్‌డ్రింక్స్‌, స్నాక్స్‌పై మాత్రమే కాక.. మరికొన్నింటిపై అదనపు జీఎస్టీ విధించాలని.. ఫిట్‌మెంట్‌ కంపెనీ ప్రతిపాదించింది. అలానే ఆన్‌లైన్‌ గేమింగ్, గుర్రపు పందేలు-క్యాసినోలపై 28 శాతం పన్ను విధించాలని ఫిట్ మెంట్ కమిటీ ప్రతిపాదించింది. ఈ నెల 11న జరిగే కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సినిమా హాళ్లలో తినుబండారాలు పానీయలపై అదనపు జీఎ స్టీ విధించాలని నిర్ణయించిన నేపథ్యంలో మరీ ప్రేక్షకులు ఈ నిర్ణయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి