iDreamPost

తనది లవ్ మ్యారేజ్ అంటూ తేల్చేసిన సదా.. చేసుకునేది ఎవరినంటే?

Sada Comments On Love Marriage: హీరోయిన్ సదా పెళ్లి, విడాకులు, ప్రేమ వివాహానికి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తాను కచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటాను అంటూ స్పష్టం చేసింది.

Sada Comments On Love Marriage: హీరోయిన్ సదా పెళ్లి, విడాకులు, ప్రేమ వివాహానికి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తాను కచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటాను అంటూ స్పష్టం చేసింది.

తనది లవ్ మ్యారేజ్ అంటూ తేల్చేసిన సదా.. చేసుకునేది ఎవరినంటే?

హీరోయిన్ సదా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చైయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెళ్లవయ్యా వెళ్లు.. అంటూ తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో తిష్ట వేసుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత పలు హిట్లు, బ్లాక్ బస్టర్స్ తో తెలుగు ఇండిస్ట్రీలోనే కాకుండా.. సౌత్ మొత్తాన్ని ఏలేసింది. ఇప్పుడు తెలుగు బుల్లితెర ప్రేక్షకులను జడ్జి రూపంలో వచ్చి తరచుగా పలకరిస్తూనే ఉంది. అయితే వయసు నాలుగు పదులు దాటుతున్నా కూడా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే ప్రశ్న అయితే ఇంకా సదాకి ఎదురవుతూనే ఉంది. ఆ ప్రశ్నకు ఆమె ఇప్పటికే చాలాసార్లు సమాధానం చెప్పేసింది. తనకు నచ్చిన వ్యక్తి ఇంకా తారసపడలేదు అని చెప్పుకొచ్చింది. అయితే తాను చేసుకునేది మాత్రం ప్రేమ వివాహం అంటూ కుండ బద్దలు కొట్టేసింది.

సాధారణంగా సెలబ్రిటీ అనగానే కొన్నాళ్లు వాళ్ల కెరీర్ గురించి మాట్లాడతారు. ఆ తర్వాత వారి పెళ్లి గురించే ఎక్కువగా మాట్లాడతారు. ఇప్పటికే ఇండియన్ సినిమాలో ఎంతోమంది మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ ఉన్న విషయం తెలిసిందే. ఆ లిస్టులో సదా పేరును ఎప్పుడు స్ట్రైక్ ఆఫ్ చేస్తామో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అయితే వివాహం అనేది ఎవరికి వారి వ్యక్తిగతం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. హడావుడిగా చేసుకోవడానికి ఇది భోజనం, టిఫిన్ కాదు.. పెళ్లి. అంటే రెండు జీవితాలు, రెండు కుటుంబాలు దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. సదా కూడా అదే తరహా మైండ్ సెట్ తో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పటికే పలు సందర్భాల్లో ఆ విషయాన్ని స్పష్టం చేసింది. నటి సదా కచ్చితంగా ప్రమే వివాహం చేసుకుంటాను అని చెప్పేశారు. ఎందుకంటే ముక్కు మొఖం తెలియని వాళ్లని ఎలా పెళ్లి చేసుకుంటారు అని గతంలోనే ప్రశ్నించారు. అంతేకాకుండా తాను అరేంజ్డ్ మ్యారేజ్ కి వ్యతిరేకం అని కూడా చెప్పేశారు. అలాగని అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్లు ఆనందంగా లేరని కాదు. కానీ, తాను మాత్రం ప్రేమ వివాహం చేసుకంటాను అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటివరకు తనకు నచ్చిన వ్యక్తి తారస పడలేదు అనే విషయాన్ని స్పష్టం చేశారు.

అలాగే విడాకుల విషయంపై కూడా స్పందించారు. అంటే ఇష్టంలేని కాపురం కంటిన్యూ చేయడం కంటే.. విడిపోవడమే మంచిది అనేది ఆవిడ అభిప్రాయం. అంటే ఆ వ్యక్తి కలిసి బతకడం కష్టంగా ఉన్నప్పుడు విడాకులు తీసుకోవడం కూడా తప్పేంకాదు అని సదా వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదంతా ఇప్పుడు జరిగిన విషయం కాదులెండి. గతంలో జరిగిన ఒక విషయంపై సదా అప్పట్లో ఒక క్లియర్ వీడియో కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో.. మరోసారి సదా పెళ్లి వ్యవహారం.. తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అన్న విషయాలు మరోసారి చర్చకు తావిచ్చాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి