iDreamPost

ఆ హీరోతో లిప్ లాక్ సీన్స్ చాలా కంఫర్ట్.. నటి కామెంట్స్ వైరల్..

Meenakshi Seshadri, Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో నటించిన ఓ హీరోయిన్ లిప్ లాక్ సీన్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ హీరోతోనే తనకు ముద్దు సన్నీవేశాలు కంఫర్ట్ గా ఉంటాయని తెలిపింది.

Meenakshi Seshadri, Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో నటించిన ఓ హీరోయిన్ లిప్ లాక్ సీన్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ హీరోతోనే తనకు ముద్దు సన్నీవేశాలు కంఫర్ట్ గా ఉంటాయని తెలిపింది.

ఆ హీరోతో లిప్ లాక్ సీన్స్ చాలా కంఫర్ట్.. నటి కామెంట్స్ వైరల్..

ఈ మధ్యకాలంలో సినిమాల్లో ముద్దు సన్నివేశం చాలా కామన్ అయ్యింది. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఇవ్విలేని సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఇటీవల కాలంలో ఈ కల్చర్ టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే.. ఈ లిప్  లాక్ సీన్స్ లో నటించేందుకు కొందరు హీరోయిన్లు ఎలాంటి మోహమాటం పడటం లేదు. అయితే కొందరు మాత్రం ఈ సీన్లు చేసేందుకు చాలా ఇబ్బంది పడుతుంటారు. మరికొందరు హీరోయిన్లు అయితే కొందరు హీరోలతో చాలా కంఫర్ట్ గా లిప్ లాక్ సీన్లు చేస్తుంటారు. అలానే మెగాస్టార్ చిరంజీవితో నటించిన హీరోయిన్ లిప్ లాక్ సీన్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ హీరోతోనే తనకు ముద్దు సన్నీవేశాలు కంఫర్ట్ గా ఉంటాయని తెలిపింది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు, ఆ హీరో ఎవరు, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కళతపస్వీ కె. విశ్వనాథన్ తెరకెక్కించిన సినిమా ఆపద్బాంధవుడు. 1992లో విడుదలైన ఈ  సినిమా అద్భుత విజయం అందుకుంది. ఈ సినిమాతో మెగాస్టార్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మూవీలో చిరంజీవి సరసన నటించిన హీరోయిన్ గా మీనాక్షి శేషాద్రి నటించారు. ఈ తరం ప్రేక్షకులకు ఈ అమ్మడు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 90 దశకం వారిని మాత్రం ఈ అమ్మడు తన అందంతో ఆకట్టుకుంది. ఆపద్బాంధవుడు చిత్రంలో మీనాక్షి అద్భుతంగా నటించింది ప్రేక్షులతో విజిల్స్ వేయించుకుంది.

మీనాక్షి టాలీవుడ్ లోకి బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత ఆపద్బాంధవుడు మూవీలో అవకాశం రావడం,హిట్ కొట్టడం జరిగాయి. ఆ తరువాత నేరుగా బాలీవుడ్ కి చెక్కేసి.. అక్కడ వరుసగా సినిమాలు చేసింది. 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. తాజాగా మీనాక్షి ఓ యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాట్  కామెంట్స్ చేశారు. అలానే ఓ స్టార్ హీరోతో ముద్దు సీన్ గురించి చెప్పుకొచ్చారు.  బాలీవుడ్ లో దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించారు. ఈ ఇండస్ట్రీలో ఒక హీరోతో ముద్దు సన్నీవేశం చాలా కంఫర్ట్ గా ఉందని మీనాక్షి చెప్పుకొచ్చారు.

సన్నీ డియోల్‌ తో లిప్ లాక్ చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది అని అన్నారు. డెకైట్ అనే సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ సినిమాలో ఓ సన్నీవేశంలో సన్నీతో ముద్దు సీన్ వచ్చింది. అయితే ఆ సందర్భంలో సన్నీ డియోల్ తో లిప్ లాక్ సీన్  చాలా కంఫర్ట్ గా అనిపించిందని మీనాక్షి చెప్పుకొచ్చింది. తాను ఆ ముద్దును చాలా ఎంజాయ్ చేశానని, తమ ఇద్దరి మధ్య ఓ అవగాహన ఉందని తెలిపింది. అందుకే  తామిద్దరం లిప్ లాక్ సీన్లు చేశామంటూ మీనాక్షి శేషాద్రి హాట్ కామెంట్స్ చేశారు. మరి.. ఈమె చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Meenakshi Seshadri Mysore (@iammeenakshiseshadri)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి