iDreamPost

నాకు లైసెన్స్ రివాల్వర్ కు అనుమతివ్వండి! SPని కోరిన నటుడు VK నరేష్

  • Author Soma Sekhar Published - 12:39 PM, Fri - 7 July 23
  • Author Soma Sekhar Published - 12:39 PM, Fri - 7 July 23
నాకు లైసెన్స్ రివాల్వర్ కు అనుమతివ్వండి! SPని కోరిన నటుడు VK నరేష్

సాధారణంగా రాజకీయ నాయకులకు, సినీ సెలబ్రిటీలకు అపరిచిత వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తుంటాయి. దాంతో వారు పోలీసుల కలిసి లైసెన్స్ రివాల్వర్ కావాలని దరఖాస్తు చేస్తుంటారు. కాగా.. ఇప్పటికే చాలా మంది పొలిటికల్ లీడర్ల దగ్గర, అలాగే సినీ ప్రముఖుల దగ్గర లైసెన్స్ రివాల్వర్లు ఉన్నాయి. తాజాగా మరో సీనియర్ నటుడు తనకు ప్రాణహాని ఉందని, తనకు లైసెన్స్ రివాల్వర్ కు అనుమతి ఇవ్వాలని జిల్లా ఎస్పీని కలిశారు. ఆ నటుడు ఎవరో కాదు రీసెంట్ గా సామజవరగమనలో తన మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించిన వీకే నరేష్. మరి ఆయన లైసెన్స్ రివాల్వర్ కు అనుమతివ్వాలి ఎందుకు ఎస్పీని కోరారో ఇప్పుడు తెలుసుకుందాం.

వీకే నరేష్.. కామెడీ హీరోగా 90వ దశకంలో తెలుగు సినీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ.. హీరోలకు తండ్రి పాత్రలతో టాలీవుడ్ మోస్ట్ బిజియోస్ట్ ఆర్టిస్ట్ గా మారారు. ఇక కొద్ది రోజుల క్రితం పవిత్ర లోకేష్ తో పెళ్లితో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఇవన్ని కొద్దిసేపు పక్కన పెడితే.. తాజాగా ఆయన శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీని కలిసి.. తనకు లైసెన్స్ రివాల్వర్ కు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే గతంలోనే ఆయనకు లైసెన్స్ తుపాకి ఉంది. మవోయిస్ట్ ల నుంచి నరేష్ కు ప్రాణహాని ఉందని 2008లో లైసెన్స్ రివాల్వర్ పొందారు నరేష్. దానికి మళ్లీ అనుమతి ఇవ్వాలని తాజాగా పుట్టపర్తిలోని ఎస్పీని కోరారు. అయితే గతంలో ఒకసారి ఇలాగే గన్ లైసెన్స్ ఇవ్వాలని కోరగా.. అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం హిందూపురంలో నివాసం ఉంటున్న నరేష్.. లైసెన్స్ రివాల్వర్ తన వద్ద ఉంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఎస్పీని కోరారు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని నరేష్ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి