iDreamPost

Acharya ఆచార్యా! ఉన్నది 9 రోజులే

Acharya ఆచార్యా! ఉన్నది 9 రోజులే

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అభిమానులకు వచ్చే ఊపు వేరు. అందులోనూ రామ్ చరణ్ ఫుల్ లెన్త్ కాంబినేషన్ అంటే చెప్పేదేముంది. అందుకే ఆచార్య ప్రకటన వచ్చినప్పుడే సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి ఎగ్జైట్ మెంట్ కనిపించింది. కానీ విడుదలకు కేవలం 9 రోజులు మాత్రమే ఉన్నప్పటికీ ఆ రేంజ్ జోష్ ఇప్పుడు కనిపించడం లేదన్నది వాస్తవం. విపరీతమైన వాయిదాలు దీనికి మొదటి కారణమని చెప్పుకున్నా ప్రమోషన్ విషయంలో జరిగిన అలసత్వానికి నిర్మాతలను నిందించక తప్పదు.

ఆర్ఆర్ఆర్ లాంటి యునానిమస్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమాగా ఆచార్య మీద హైప్ ఓ లెవెల్ లో ఉండాలి. కానీ ఆ స్థాయిలో బజ్ సోషల్ మీడియాలోనూ లేదు. మొన్న వదిలిన బంజారా పాటతో విజువల్ గా ఫ్యాన్స్ సంతృప్తి పడ్డారు కానీ మణిశర్మ మేజిక్ ఇందులో కనిపించలేదనే కామెంట్స్ గట్టిగానే వినిపించాయి. ఇక ట్రైలర్ సంగతి సరేసరి. మిలియన్ల వ్యూస్ పైకి కనిపిస్తున్నాయి కానీ ఇంత పెద్ద మూవీకి జరగాల్సిన సందడి హంగామా లేదనే ఫిర్యాదులో నిజం లేకపోలేదు.

ఇంకా ఇంటర్వ్యూలు మొదలుకాలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ 23 ఫిక్స్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గెస్టనే ఫీలర్లు వదిలారు. ఏదీ అఫీషియల్ కాలేదు. కాజల్ అగర్వాల్, సోనూ సూద్ లాంటి పెద్ద క్యాస్టింగ్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరూ పర్సనల్ గా ప్రమోట్ చేయడం లేదు. పూజా హెగ్డే ఒకటే ట్వీట్లు పెడుతోంది. ఇక టీమ్ తరఫున ఒక్కరంటే ఒక్కరు టీవీ లేదా మీడియా ముందుకు వస్తే ఒట్టు. సైరా టైంలో ఈ పరిస్థితి లేదు. టీజర్, ట్రైలర్ కే రచ్చ పీక్స్ కు వెళ్ళింది. కానీ ఆచార్యకు అంతా రివర్స్ లో కనిపిస్తోంది.

ఇప్పటికైనా మేల్కొని ఆచార్య టీమ్ పబ్లిసిటీ స్పీడ్ ని పెంచాలి. 29 నాటికి కెజిఎఫ్ దూకుడు తగ్గి ఉంటుంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవాలి. మే 12న సర్కారు వారి పాట వచ్చేలోగా చేతిలో ఉన్న రెండు వారాల్లో వీలైనంత వసూళ్లను రాబట్టుకునేలా ప్లానింగ్ ఉండాలి. ఇప్పటిదాకా ఫెయిల్యూర్ చూడని దర్శకుడు కొరటాల శివకున్న బ్రాండ్ ఇమేజ్ ఆచార్య కంటిన్యూ చేయాల్సిన ఒత్తిడి మీద మూవీ మీద ఉంది. ఎంత బలమైన కంటెంట్ ఉంటే మాత్రం ఇంత మౌనంగా ఉంటే ఎలా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి