iDreamPost

బాబు లాయర్ల అత్యుత్సాహం.. బెంచ్ దిగి వెళ్లిపోయిన ACB కోర్టు జడ్జి

బాబు లాయర్ల అత్యుత్సాహం.. బెంచ్ దిగి వెళ్లిపోయిన ACB కోర్టు జడ్జి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుల నుంచి బయట పడేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే హైకోర్టులో, సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్లు దాఖలు చేస్తూ బయట పడేందుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. కానీ న్యాయస్థానాల్లో వరుస షాక్ లు తగులుతుండడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు చంద్రబాబు అతడి అనుచర వర్గం. ఇదే సమయంలో బాబు లాయర్లు కూడా ఫ్రస్టేషన్ కు లోనవుతున్నారు. తాజాగా ఏసీబీ కోర్టులో సీఐడీ లాయర్లతో దురుసుగా ప్రవర్తించారు.

ఇవాళ ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డులపై విచారణ జరిగింది. సీఐడీ అధికారుల కాల్‌డేటా ఇవ్వాలంటూ టీడీపీ వర్గాలు పిటిషన్‌ దాఖలు చేశాయి. పిటిషన్ వేసి ఇప్పటికే నెల రోజులైందని చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ జడ్జికి వివరించగా.. అసలు పిటిషనుకు అర్హతే లేదని సీఐడీ న్యాయవాది వివేకానంద తెలిపారు. ఈ సందర్భంలో సీఐడీ తరపు స్పెషల్ గవర్నమెంట్‌ ప్లీడర్‌ వివేకానందపైకి చంద్రబాబు లాయర్లు దూసుకెళ్లారు.

వివేకా లీగల్ సబ్మిషన్లు చెబుతున్న సమయంలో బాబు లాయర్‌ లక్ష్మీనారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో.. ఈ కేసులో ఎందుకిలా చేస్తున్నారంటూ లక్ష్మీ నారాయణను ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నించారు. అయితే ఇరువైపులా వాగ్వాదం జరిగింది. ఇరువైపులా అరుపులతో కాసేపు కోర్ట్ హాల్ దద్దరిల్లిపోయింది. లక్ష్మీనారాయణ, నాగరాజు అనే లాయర్లు.. అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్నారా? అంటూ ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నించారు. అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్న వాళ్లు తప్ప అందరూ బయటకెళ్లాల్సిందిగా ఆదేశించారు. ఈ విధంగా ఉంటే విచారించాలేనంటూ బెంచ్ దిగి వెళ్లిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి