iDreamPost

వీడియో: ఇది నేను చూడలా.. గాలికి విమానమే ఒరిగిపోయింది

Storm Spin Boeing 737: సాధారణంగా ఈదురుగాలులు అంటే ఇంటి కప్పులు, రోడ్డు మీద కార్లు కొట్టుకుపోవడం చూస్తుంటాం. కానీ, ఇక్కడ మాత్రం ఒక విమానం కొట్టుకుపోయింది.

Storm Spin Boeing 737: సాధారణంగా ఈదురుగాలులు అంటే ఇంటి కప్పులు, రోడ్డు మీద కార్లు కొట్టుకుపోవడం చూస్తుంటాం. కానీ, ఇక్కడ మాత్రం ఒక విమానం కొట్టుకుపోయింది.

వీడియో: ఇది నేను చూడలా.. గాలికి విమానమే ఒరిగిపోయింది

సాధారణంగా ఇప్పటివరకు భారీ వర్షాల కారణంగా వరదల్లో కార్లు కొట్టుకుని వెళ్లిపోవడం చూశాం. వర్షాల సమయంలో వచ్చే ఈదురు గాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపోవడం, చెట్లు, కరెంటు స్తంభాలు ఒరిగిపోవడం ఇలాంటివి కూడా చాలానే చూశాం. కానీ, ఇక్కడ బీభత్సమైన ఈదురు గాలుల కారణంగా ఏకంగా రన్ వే పైన ఉన్న విమానమే.. ఒరిగిపోయింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో.. నెటిజన్లను అబ్బుర పరుస్తోంది. ఆగి ఉన్న విమానం గాలుల కారణంగా కదలడం చూసి నోరెళ్లబెడుతున్నారు.

తాజాగా అర్జెంటీనాలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు.. అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి. అక్కడ దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈ క్రమంలో అర్జెంటీనాలో బ్యూనస్ ఏరిస్ సమీపంలోని ఏరోపార్క్ జార్జ్ న్యూబెరీ విమానాశ్రయంలో.. రన్ వే పార్కింగ్ లో ఉన్న ఒక విమానం గాలులు వీస్తున్న వేగానికి ఒక్కసారిగా పక్కకు కదిలిపోయింది. అదే రన్ వే పైన ఉన్న బోర్డింగ్ స్టెప్స్ కూడా ఒరిగిపోయాయి. దీని వలన కొంతమేరకు నష్టం వాటిల్లింది. దీనికి సంభందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. విమానం వీల్స్ లాక్ చేయని కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రకృతి తలుచుకుంటే ఏదైనా సాధ్యం అని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

కాగా, ఈ అకాల గాలి వానల కారణంగా భారీ నష్టం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా వరకు ఇల్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటికి వరకు 14 మంది ప్రాణాలను కోల్పోయారు. పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా భీకర దృశ్యాలు కనిపించాయి. దీనితో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు. నిత్యావసర సేవలు కూడా వారికి అందడంలేదు. ఆయా ప్రదేశాలలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు, ఈ ఈదురు గాలుల కారణంగా  రోలర్ స్కేటింగ్ క్రీడాప్రాంగణం కూలిపోయింది. ఈ ప్రాంగణం బహియా బ్లాంకా సిటీలో ఉంది. అక్కడ జరిగిన ఘటనలో 14 మంది గాయపడ్డారు. కాగా, ఆ ఘటన తర్వాత బహియా బ్లాంకా ప్రదేశాన్ని అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలే సందర్శించి.. బాధితులను పరామర్శించారు. ఇక ప్రస్తుతం భీకర గాలుల కారణంగా విమానం ఒరిగిపోయిన దృశ్యాలు .. సామజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పదింస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి