iDreamPost

VIDEO: 7/G బృందావన కాలనీలో కాజల్ అగర్వాల్​ నటించిందా?

  • Author singhj Published - 05:32 PM, Sat - 23 September 23
  • Author singhj Published - 05:32 PM, Sat - 23 September 23
VIDEO: 7/G బృందావన కాలనీలో కాజల్ అగర్వాల్​ నటించిందా?

సినిమాలను బాగా చూసే వారిలో యూత్ ఆడియెన్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే యవతను మెప్పించే అంశాలు తమ చిత్రాల్లో ఉండేలా హీరోలు, దర్శకులు జాగ్రత్తలు తీసుకుంటారు. యూత్ ఆడియెన్స్​ను టార్గెట్ చేస్తూ వచ్చే మూవీస్​కు లెక్కే లేదు. అయితే వీటిల్లో ప్రేమ కథా చిత్రాలే ఎక్కువ. లవ్ స్టోరీస్​కు యూత్ ఎక్కువగా కనెక్ట్ అవుతారనే ఉద్దేశంతో ఇలాంటి సినిమాలను తీస్తుంటారు మేకర్స్. కానీ అన్ని ప్రేమ కథా చిత్రాలు హిట్టవ్వవు. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయి ఎమోషన్స్​ను పంచగలిగితేనే సినిమా సక్సెస్ అవుతుంది.

ఎవర్​గ్రీన్ యూత్​ఫుల్ హిట్ మూవీస్​లో ఎక్కువగా లవ్ స్టోరీస్ ఉన్నాయి. అలాంటి ఒక చిత్రమే 7/జీ బృందావన్ కాలనీ. 2004లో విడుదలైన ఈ చిత్రంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించారు. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా మూవీ అప్పట్లో యువతను ఒక ఊపు ఊపింది. ఇందులో రవికృష్ణ నటన, డైలాగ్ డెలివరీ ట్రెండ్ సెట్ చేశాయి. ఈ సినిమాలోని పాటలు చార్ట్​ బస్టర్​ అయ్యాయి. రవికృష్ణ-సోనియా మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు మెయిన్ హైలైట్​గా నిలిచాయి. ఇప్పుడు రీ-రిలీజ్ హవా నడుస్తున్న నేపథ్యంలో నిన్న (సెప్టెంబర్ 22న) 7జీ బృందావన కాలనీ మూవీని మళ్లీ విడుదల చేశారు. మూవీ రీ-రిలీజ్​కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

7జీ బృందావన్​ కాలనీ సినిమాకు వెళ్లిన ఆడియెన్స్ కొన్ని వీడియో క్లిప్స్​ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఇందులోని ఓ వీడియోలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లాగే ఉన్న ఓ అమ్మాయి కనిపించారు. ‘మేం వయసుకు వచ్చాం’ పాటలో హీరో రవికృష్ణ పక్కన డ్యాన్సర్లలో అచ్చం కాజల్​ పోలికలతో ఉన్న వ్యక్తి ఉన్నారు. దీంతో 7జీ బృందావన్​ కాలనీలో కాజల్ నటించారంటూ నెట్టింట అనేక పోస్టులు దర్శనమిస్తున్నాయి. అయితే ఆ వీడియోలో ఉన్నది కాజలేనా కాదా అనేది క్లారిటీ రాలేదు. కొందరు నెటిజన్స్ మాత్రం అది ఫేక్ వీడియో అని.. కాజల్ నటించిన తొలి సినిమాతో పోలిస్తే ఈ వీడియోలోని అమ్మాయిలో చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఏదేమైనా ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ఇదీ చదవండి: అమ్మకు క్యాన్సర్.. నన్నూ టెస్ట్ చేయించుకోమన్నారు: స్టార్ హీరోయిన్ ఎమోషనల్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి