iDreamPost

IND vs ENG: జడేజా మ్యాజిక్‌.. పెవిలియన్‌కు క్యూ కట్టిన ఇంగ్లండ్‌ ప్లేయర్లు!

  • Published Feb 18, 2024 | 3:57 PMUpdated Feb 18, 2024 | 3:57 PM

557 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. ఒక్కో రన్‌ చేయడానికి ఆపసోపాలు పడుతోంది. భారత స్పిన్నర్లను ఎదుర్కొలేక ఇంగ్లండ్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇప్పటి వరకు కేవలం ఇద్దరే ఇద్దరు డబుల్‌ డిజిట్‌ స్కోర్‌ చేశారు.

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌ 4 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్‌ ముందు 556 పరుగుల భారీ స్కోర్‌ పెట్టింది. ఈ స్కోర్‌ చూసి ఇంగ్లండ్‌ భయపడిందో ఏమో కానీ.. రెండో ఇన్నింగ్స్‌లో బజ్‌బాల్‌ మర్చిపోయి.. పెవిలియన్‌కు క్యూకట్టింది. వచ్చిన వాళ్లు వచ్చినట్లే వికెట్‌ సమర్పించుకుంటూ.. ఆలౌట్‌ దిశగా సాగుతున్నారు. 557 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. కేవలం 50 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి.. ఓటమి వైపు పయనిస్తోంది. ఇప్పటికే వరకు ఇంగ్లండ్‌ బ్యాటర్లలో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు.

ఓపెనర్‌ జాక్‌ క్రాలే 11, బెన్‌ డకెల్‌ 4, ఓలీ పోప్‌ 3, జో రూట్‌ 7, జానీ బెయిర్‌ స్టో 4, బెన్‌ స్టోక్‌ 15, రెహాన్‌ అహ్మద్‌ 0.. ఇలా అంతా విఫలం అయ్యారు. ప్రస్తుతం క్రీజ్‌లో బెన్‌ ఫోక్స్‌ , టామ్‌ హార్ట్లీ ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా తన స్పిన్‌ మ్యాజిక్‌తో ఇంగ్లండ్‌ను వణికిస్తున్నాడు. ఇప్పటి వరకు 9 ఓవర్లు వేసి కేవలం 10 రన్స్‌ ఇచ్చి 3 వికెట్ల పడగొట్టాడు. బుమ్రా, కుల్దీప్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. బెన్‌ డకెట్‌ రనౌట్‌ అయ్యాడు. టీమిండియా విజయానికి మరో నాలుగు వికెట్ల దూరంలో ఉంది. ప్రస్తుతం టీమిండియా బౌలర్ల జోరు చూస్తుంటే.. మ్యాచ్‌ నాలుగో రోజే ముగిసేలా ఉంది. టీమిండియా విధించిన టార్గెట్‌, ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ బలం చూసి.. మ్యాచ్‌ ఐదు రోజుకు వెళ్తుందని అంతా భావించారు. కానీ, జడేజా స్పిన్‌ మ్యాజిక్‌ చేస్తుండటంతో ఇంగ్లండ్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి