iDreamPost

Viral News : ఆవు చికిత్స కోసం ఏడుగురు వెటర్నరీ వైద్యుల బృందం నియామకం..

Viral News : ఆవు చికిత్స కోసం ఏడుగురు వెటర్నరీ వైద్యుల బృందం నియామకం..

ఒక ఆవుకు చికిత్స చేసేందుకు చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ ఏడుగురు వెటర్నరీ వైద్యుల బృందాన్ని నియమించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో వెలుగుచూసింది. జిల్లా మెజిస్ట్రేట్ అపూర్వ దూబేకు చెందిన ఆవుకు చికిత్స చేసేందుకు..రోజుకొక వైద్యుడి చొప్పున వారానికి ఏకంగా ఏడుగురు వెటర్నరీ వైద్యులను నియమించడం సంచలనమైంది. అందుకు సంబంధించిన ఉత్తర్వుల కాపీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. విషయం తెలిసిన జిల్లా అధికారులు దానిని కుట్ర గా భావించారు. జూన్ 9వ తేదీన ఈ ఉత్తర్వు జారీ అవ్వగా.. తాత్కాలిక చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ (CVO) డాక్టర్ SK తివారీ ఒక రోజు తర్వాత దానిని రద్దు చేశారు.

సీవీఓ ఆదేశాలను ఏకపక్షంగా జారీ చేశారని.. వాటిని రద్దు చేయాలని ఆమె కోరడంతో అధికారి రద్దు చేశారని డీఎం తెలిపారు. గతంలో పని తీరు సరిగా లేదని సదరు అధికారిపై పశువైద్య శాఖకు ఫిర్యాదు చేసినట్లు డీఎం తెలిపారు. గతంలో కూడా ఆయనకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. కాగా.. ఆ ఉత్తర్వుల్లో ఆవును రోజుకు రెండు సార్లు పరీక్షించి, తమ నివేదికను సాయంత్రం 6 గంటలలోపు CVO కార్యాలయంలో సమర్పించాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే క్షమించేది లేదని పేర్కొని ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి