iDreamPost

బీహార్ లో 500 ట‌న్నుల ఐరెన్ బ్రిడ్జిని ఎత్తుకెళ్లారు

బీహార్ లో 500 ట‌న్నుల ఐరెన్ బ్రిడ్జిని ఎత్తుకెళ్లారు

stolen, A 60-Feet Steel Bridge In Bihar  1972లో ఆరా కాల్వపై ఉక్కుతో వంతెన నిర్మించారు. వంతెన పొడ‌వు 60 అడుగులు. ఎత్తు 12 అడుగులు. బ‌రువు 500 ట‌న్నులు. కాలక్రమేణా అది తుప్పుపట్టడంతో రాకపోకలు నిలిపేసి కాంక్రీట్ వంతెను కట్టారు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ను ఎవ‌రూ వాడ‌టంలేదు. ఐరెన్ రేట్లు బాగా పెరిగాయిక‌దా!. దొంగల చూపు దానిపై పడింది. దర్జాగా దొచుకుపోవడానికి మాంచి స్కెచ్ వేశారు. తాము ఇరిగేష‌న్ అధికారుల‌మ‌ని చెప్పి గ్యాస్ కట్టర్లతో స‌హా వ‌చ్చారు. ఊరును న‌మ్మించారు. బ్రిడ్జినే ముక్క‌లు చేసి ఎత్తుకెళ్లారు.

బిహార్‌, రోహ్తాస్‌ జిల్లా అమియావార్‌లో ఓ పాత‌ ఇనుప వంతెనను దొంగలు మూడు రోజుల్లోనే మాయంచేశారు. ఇంకో చిత్ర‌మేంటంటే, స్థానిక సిబ్బంది, గ్రామస్థులుకూడా వీరికి సహకరించారు. ముక్క‌లు చేసిన వంతెన‌ను లారీల్లోకి ఎక్కించింది స్థానికులే.

పాత బ్రిడ్జికూలితే ప్రమాదమ‌ని, కూల్చివేయాలని గ్రామస్థులు ఇంత‌కుముందే అధికారులకు విన్న‌వించుకున్నారు. ఇదే అదునుగా దొంగ‌లు వ‌చ్చారు, దర్జాగా దోచుకెళ్లారు. అస‌లు సంగ‌తి తెలిసి స్థానికులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

చుట్టుప్ర‌క్క‌ల పాత ఇనుప‌సామాను వ్యాపారులను పోలీసులు అప్రమత్తం చేశారు. పాత ఐరెన్ ను అమ్మడానికి తీసుకొస్తే తమకు చెప్పాల‌న్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి