iDreamPost

Devi @25: షాకింగ్ విషయాలు చెప్పిన ప్రేమ.. నిజంగానే పాము కాటేసిందంటూ..

  • Published Mar 12, 2024 | 4:36 PMUpdated Mar 12, 2024 | 4:36 PM

డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవి' సినిమా విడుదలయ్యి నేటితో పాతిక సంవత్సరాలు పూర్తైన సంధర్బంగా .. దేవి సినిమా హీరోయిన్ ప్రేమ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవి' సినిమా విడుదలయ్యి నేటితో పాతిక సంవత్సరాలు పూర్తైన సంధర్బంగా .. దేవి సినిమా హీరోయిన్ ప్రేమ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

  • Published Mar 12, 2024 | 4:36 PMUpdated Mar 12, 2024 | 4:36 PM
Devi @25: షాకింగ్ విషయాలు చెప్పిన ప్రేమ.. నిజంగానే పాము కాటేసిందంటూ..

ఇప్పుడంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త కొత్త డైరెక్టర్స్.. ప్రొడ్యూసర్స్ వస్తూ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కానీ, టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందక ముందే.. అప్పట్లో కొంతమంది డైరెక్టర్స్ .. తెలుగు ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. అటువంటి ఎంతో మంది డైరెక్టర్స్ లో కోడి రామకృష్ణ ఒకరు. ఈ దర్శకుడు ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ను అందించారు. వాటిలో ముఖ్యంగా అందరికి గుర్తిండిపోయే మూవీ “దేవి”. అప్పట్లో ఈ సినిమాకు లభించిన ఆదరణ అంత ఇంత కాదు. మార్చి 12,1999 లో ఈ సినిమా థియేటర్స్ విడుదలయ్యి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. నేటికీ అంటే మార్చి 12,2024 కి ఈ సినిమా విడుదలయ్యి పాతికేళ్ళయింది. ఈ సందర్బంగా దేవి సినిమా హీరోయిన్ ప్రేమ ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

నటి ప్రేమ దేవి సినిమా గురించి మాట్లాడుతూ.. “అప్పట్లో లేడి ఓరియెంటెడ్ సినిమాలు తక్కివగా వచ్చేవి. రిస్క్ చేసి మరి “దేవి” సినిమాను తెరకెక్కించారు కోడి రామకృష్ణ. ఆ మూవీ ఆ స్థాయిలో విజయం సాధించడానికి గల ప్రధాన కారణం ఆయనే. ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. సీన్ సరిగా రాకపోతే మళ్ళీ మళ్ళీ చేయించేవారు. ఒక్కో సీన్ 50 టేకులకుపైగా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నాతో డైలాగ్స్ బాగా ప్రాక్టీస్ చేయించేవారు. దేవత ఎలా మాట్లాడుతుందో అలానే మాట్లాడాలని చెప్పేవారు. అలాగే గెట్ అప్ వేసిన తర్వాత నా హావభావాలు ఆటోమేటిక్ గా మారిపోయేవి.

అలాగే టీం అంతా పగలు, రాత్రి కస్టపడి పని చేశాం. షూటింగ్ సమయంలో ఒక వ్యక్తిని నిజంగానే పాము కాటేసింది. అతన్ని హాస్పిటల్ కు తీసుకుని వెళ్లినా బ్రతికించుకోలేకపోయాం. ఆ బాధతో రెండు షూటింగ్ నిలిపివేశాం. క్లైమాక్స్ షూటింగ్ సమయంలో కూడా చాల ఇబ్బంది పడ్డాం. మంచులో సినిమా షూటింగ్ చేయడం సవాల్ గా మారింది. సినిమా రిలీజ్ తర్వాత మా కష్టానికి ప్రతిఫలం దక్కిందని భావించాం. ప్రేక్షకుల స్పందన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. నా కెరీర్ లో ‘దేవి’ స్పెషల్ మూవీ” అంటూ ప్రేమ చెప్పుకొచ్చారు. మరి దేవి సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు అయిన సంధర్బంగా నటి ప్రేమ షేర్ చేసుకున్న విషయాలపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి