iDreamPost

2022 రివ్యూ 9 – ఓటిటి రౌండప్

2022 రివ్యూ 9 – ఓటిటి రౌండప్

కరోనా వచ్చి వెళ్ళాక థియేటర్లకు పోటీ ఇచ్చేలా ఓటిటిలోనూ స్ట్రెయిట్ రిలీజులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లో వర్కౌట్ కావని అర్థం చేసుకున్న నిర్మాతలు కొందరు డిజిటల్ వైపు మొగ్గు చూపుతుండగా మరికొందరేమో సదరు కంపనీల కండీషన్లు భరించలేక కష్టమో నష్టమో బిగ్ స్క్రీన్ రిలీజ్ కే సిద్ధపడుతున్న దాఖలాలు ఎక్కువయ్యాయి. 2022లో జరిగిన కొన్ని కీలక పరిణామాల గురించి రౌండ్ అప్ వేద్దాం. సుమంత్ హీరోగా నటించిన ‘మళ్ళీ మొదలైంది’ జీ5లో నేరుగా స్ట్రీమింగ్ జరుపుకుంది. విడాకులు తీసుకున్న జంటల రెండో పెళ్లి బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ మూవీకి ఏమంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు కానీ ఇంట్లోనే చూసే కాలక్షేపంగా పేరొచ్చింది.

ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందిన ‘భామ కలాపం’ ఆహాలో సూపర్ హిట్ అనిపించుకుంది. ఫ్యామిలీ జానర్ లో క్రైమ్ కాన్సెప్ట్ ని తీసుకురావడం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఆది పినిశెట్టి ‘క్లాప్’ని సోనీ లివ్ లో ఇచ్చారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. దుల్కర్ సల్మాన్ డబ్బింగ్ మూవీ ‘సెల్యూట్’ ఇదే ఫ్లాట్ ఫార్మ్ పై పర్వాలేదనిపించుకుంది. నివేదా థామస్ టైటిల్ రోల్ పోషించిన ‘బ్లడీ మేరీ’కి ఆహాలో కాంప్లిమెంట్స్ వచ్చాయి. కీర్తి సురేష్ ‘చిన్ని’కి అమెజాన్ ప్రైమ్ లో ఆశించిన ఫలితం దక్కలేదు. తన పెర్ఫార్మన్స్ ప్రశంసలు అందుకుంది

రాజ్ తరుణ్ వెబ్ డెబ్యూ చేసిన సిరీస్ ‘ఆహ నా పెళ్ళంట’కు కుటుంబ ప్రేక్షకుల మద్దతు దక్కింది. మల్లాది నవల ఆధారంగా క్రిష్ నిర్మాణంలో రూపొందిన ‘9 అవర్స్’ థ్రిల్లర్ లవర్స్ ని మెప్పించింది. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘కిన్నెరసాని’ సోసోగానే రీచ్ అయ్యింది. ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘రెక్కీ’ మంచి సక్సెస్ అందుకుంది. ఆనంద్ దేవరకొండ ‘హైవే’ జస్ట్ ఓకే అనిపించుకుంది. హెబ్బా పటేల్ ‘ఓదెల రైల్వేస్టేషన్’ యావరేజయ్యింది. అలీ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి, అమలా పాల్ కడవర్, ది టీచర్, ఐరావతం, రిపీట్, జగమే మాయ తదితరులు ఇంకా చాలానే వచ్చాయి ఇంపాక్ట్ చూపించినవి మాత్రం తక్కువేనని చెప్పాలి. ఇవి కాకుండా పదుల సంఖ్యలో కన్నడ హిందీ మళయాలం డబ్బింగ్ వెర్షన్లు ఓటిటిలో డైరెక్ట్ రిలీజ్ అందుకున్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి