iDreamPost

స‌న్ రూఫ్, 360 డిగ్రీ కెమేరాతో కొత్త బ్రెజా 2022

స‌న్ రూఫ్, 360 డిగ్రీ కెమేరాతో కొత్త బ్రెజా 2022

మారుతీ సుజుకి బ్రెజా కొత్త టీజర్ వ‌చ్చింది. కొత్త ఫీచ‌ర్లు, కొత్త స్క్రీన్, యూత్ కు న‌చ్చేలా తీర్చిదిద్దిన కొత్త తరం కాంపాక్ట్ SUV జూన్ 30న విడుదల కానుంది. ఏంటీ కొత్త ఫీచ‌ర్స్? టయోటాతో కలిసి అభివృద్ది చేసిన కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సరికొత్త యూజర్ ఇంటర్‌ఫేస్‌తో రన్ అవుతుంది. 9-అంగుళాలు. ఇది హైఎండ్ వేరియంట్ కి మాత్ర‌మే దిగువ వేరియంట్ ల్లో 7-అంగుళాల స్క్రీన్ ఉంటుంది. Android Auto, Apple Car Playల‌తో క‌నెక్ట్ అవుతుంది.

ఇది కార్ కు సంబంధించిన స‌మాచారాన్ని ఇస్తుంది. ఒకేసారి సెగ్మెంట్ వారీ ఇన్ఫ‌ర్మేష‌న్ ను చూడొచ్చు. Suzuki Connectతో కారుకు సంబంధించిన కొత్త స‌మాచారాన్ని అందుకోవ‌చ్చు.

మారుతీసుజుకీ కొన్ని విష‌యాల్లో చాలా వెనుక‌బ‌డి ఉంటుంది. ఇప్ప‌టిదాకా స‌న్ రూఫ్ ఫెసిలిటీ లేదు. కాని బ్రెజాలో మాత్రం ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉంది. అంతేనా? కాంపాక్ట్ SUVని జాగ్ర‌త్త‌గా పార్క్ చేయ‌డానికి 360-డిగ్రీల పార్కింగ్ కెమెరాకూడా ఉంది. ఇది speedometer, gear indicator, real-time fuel economy, time , blower controls సమాచారాన్ని చూపుతుంది. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మినహా మిగిలిన ఫీచ‌ర్లింటినీ బాలెనో నుండి తీసుకున్నారు. స్టీరింగ్ వీల్ కూడా బాలెనోదే.

సెంటర్ కన్సోల్‌తో కొత్త డ్యాష్‌బోర్డ్ ను రీడిజైన్ చేశారు. క్యాబిన్ కాల‌ర్స్ మాత్రం మార‌లేదు. స్పీడోమీటర్, టాకోమీటర్ తో కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. క‌ల‌ర్ ఫుల్ TFT స్క్రీన్ తో యూత్ ను టార్గెట్ చేశారు. LXi, VXi, ZXi , ZXi+ నాలుగు వేరియంట్స్ లో దొరుకుతుంది. బేస్ LXi వేరియంట్ మినహా అన్ని వేరియంట్‌లతో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది.

కొత్త ఇంజన్ డ్యూయల్‌జెట్ టెక్నాలజీతో న‌డుస్తుందికాబ‌ట్టి మైలేజ్ బాగుంటుంది. ఇంజ‌న్ మెయింటినెన్స్ త‌క్కువ‌.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి