iDreamPost

గాల్లో ఢీ కొట్టుకున్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మృతి

  • Published Apr 23, 2024 | 11:14 AMUpdated Apr 23, 2024 | 11:14 AM

Helicopters Collide: గాల్లో ప్రయాణిస్తున్న రెండు హెలికాప్టర్లు ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టడంతో ఘొర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

Helicopters Collide: గాల్లో ప్రయాణిస్తున్న రెండు హెలికాప్టర్లు ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టడంతో ఘొర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Apr 23, 2024 | 11:14 AMUpdated Apr 23, 2024 | 11:14 AM
గాల్లో ఢీ కొట్టుకున్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మృతి

సాధారణంగా ప్రమాదాలు అనగానే మనకు కారు, రోడ్డు, బైక్‌ యాక్సిడెంట్‌ వంటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. రోడ్ల మీద ప్రయాణించే సమయంలో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం మత్తు వంటి కారణాల వల్ల యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. కానీ చాలా అరుదుగా గాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలే జరుగుతుంటాయి. అయితే వీటి వల్ల జరిగే నష్టం కూడా భారీగానే ఉంటుంది. తాజాగా ఓ చోటు అరుదైన యాక్సిడెంట్‌ చోటు చేసుకుంది. గాల్లో ప్రయాణం చేస్తున్న రెండు హెలికాప్టర్లు ఢీ కొనడంతో 10 మంది మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి.

గాల్లో హెలికాప్టర్లు ఢీ కొని.. 10 మంది చనిపోయిన దారుణం.. మలేషియాలో చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన రెండు హెలికాప్టర్లు.. ఆర్మీవని.. మిలిటరీ ప్రదర్శనలో భాగంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాయల్ మలేషియన్ నేవీ సెలబ్రేషన్ కార్యక్రమం కోసం రిహార్సల్స్‌ చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు గాలిలోనే పరస్పరం ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో రెండు హెలికాప్టర్లలో సుమారు 10 మంది సిబ్బంది ఉన్నారని.. వారంతా మృతి చెందినట్లు తెలిసింది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక స్థానిక మీడియాలో వస్తోన్న వార్తల ప్రకారం.. రెండు హెలికాప్టర్ల రెక్కలు ఒకదానికి ఒకటి తగలడం వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని సమాచారం. ప్రమాదంపై మలేషియా అధికారులు విచారణ ప్రారంభించారు.

ఈ ప్రమాదం మంగళవారం నాడు ఉదయం లుముట్‌లోని రాయల్ మలేషియన్ నేవీ (ఆర్‌ఎంఎన్‌) బేస్ దగ్గర జరిగిందని అధికారులు తెలిపారు. ఇక, స్థానిక నివేదికల ప్రకారం.. ఎం503-3 మారిటైమ్ ఆపరేషన్స్ హెలికాప్టర్ (హెచ్‌ఓఎం)లో ఏడుగురు సిబ్బంది ఉండగా, మరొక ఎం502-6 హెలికాప్టర్‌లో ముగ్గురు సభ్యులు ఉన్నట్లు సమాచారం. ఈ రెండు హెలికాప్టర్లు మే నెల 3-5 తేదీల మధ్య జరగనున్న నేవీ డేతో ప్రదర్శన ఇవ్వడం కోసం శిక్షణ పొందుతున్నట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి