iDreamPost

స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఏపీలో పదోతరగతి పరీక్షలు వాయిదా

స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఏపీలో పదోతరగతి పరీక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం సంచలన నిర్ణయం తీసుకుంది. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం తెలియజేసిందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలియజేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారము ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చి 23వ తేదీ నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగాల్సి ఉంది.

అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుతున్న సమాచారం ప్రకారం పదో తరగతి పరీక్షల కాలనిర్ణయ పట్టికను రీ షెడ్యూల్ చేసి రెండు రోజులలో పాఠశాల విద్యాశాఖ ప్రకటించనుంది.ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ 20వ తేదీ వరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు స్టేట్ సెకండరీ బోర్డు అధికారులు తెలియజేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి