iDreamPost

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? క్రేజీ ఫీచర్లతో 64 వేలకే EV

మార్కెట్ లోకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలవుతున్నాయి. అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న ఈ స్కూటర్లు తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ఈ స్కూటర్ 64 వేలకే అందుబాటులో ఉంది.

మార్కెట్ లోకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలవుతున్నాయి. అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న ఈ స్కూటర్లు తక్కువ ధరకే అందుబాటులో ఉంటున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ఈ స్కూటర్ 64 వేలకే అందుబాటులో ఉంది.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? క్రేజీ ఫీచర్లతో 64 వేలకే EV

రాను రాను ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్నది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో ప్రయాణ ఖర్చులను తగ్గించుకునేందుకు వాహనదారులు ఈవీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లు, కార్లు మార్కెట్ లో హవా కొనసాగిస్తున్నాయి. ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థలు లేటెస్ట్ వర్షన్లతో, క్రేజీ ఫీచర్లతో, స్టన్నింగ్ డిజైన్ తో ఈవీలను రూపొందిస్తూ మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఈవీ ప్రియులకు మరో కొత్త ఈ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. తాజాగా జెలియో ఇ-బైక్స్‌ కొత్త ఎక్స్ మెన్ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని విడుదల చేసింది. మరి మీరు కూడా కొత్త ఈవీని కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే 64 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ను దక్కించుకోవచ్చు.

ఈవీ టూవీలర్ తయారీ కంపెనీలు తమ సేల్స్ ను పెంచుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. అయితే కొత్తగా రిలీజ్ అయిన జెలియో ఎక్స్ మెన్ ఇ-స్కూటర్లు 64 వేలకే అందుబాటులో ఉన్నాయి. ఇది లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. కాబట్టి దీన్ని నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఎక్స్-మెన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ .64,543 ఎక్స్‌-షోరూమ్ ధరకు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇది సింగిల్ ఛార్జ్ తో 55-60 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లుగా ఉంది. 60వి/ 32ఏహెచ్ లెడ్-యాసిడ్ బ్యాటరీని ఇందులో వినియోగించారు. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు 7-8 గంటల సమయం పడుతుంది.

ఇక మిడ్ వేరియంట్ ధర రూ .67,073 గా ఉంది. 72వీ / 32 ఏహెచ్ లెడ్-యాసిడ్ బ్యాటరీని ఇందులో వినియోగించారు. దీనిని ఛార్జ్‌ చేసేందుకు 7-9 గంటల సమయం పడుతుంది. సింగిల్ ఛార్జ్ తో 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఇక టాప్ వేరియంట్ ధర రూ .87,673గా ఉంది. 60వీ / 32 ఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ 4 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. జెలియో ఎక్స్ మెన్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో యాంటీ-థెఫ్ట్ అలారం, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రియర్ డ్రమ్ బ్రేక్స్ మరియు ముందు భాగంలో అల్లాయ్ వీల్ ఉన్నాయి. రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్, యూఎస్బీ ఛార్జింగ్, హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. స్కూటర్లలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, సెంట్రల్ లాకింగ్ కూడా ఉన్నాయి. బ్లాక్, వైట్, సీ గ్రీన్, రెడ్ కలర్స్ లో ఈ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి