iDreamPost

వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం రెండో ఏడాది ఆర్థిక సాయం: 81,024 మంది లబ్ధిదార్లకు రూ.194.46 కోట్ల ఆర్ధిక సాయం

వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం రెండో ఏడాది ఆర్థిక సాయం: 81,024 మంది లబ్ధిదార్లకు రూ.194.46 కోట్ల ఆర్ధిక సాయం

కరోనా కష్టకాలంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ కష్ట కాలంలోనూ పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడింది. కరోనా వైరస్‌ నివారణకై మాస్కుల తయారీకై ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాల నుంచి సేకరించిన వస్త్రాలకు రూ.109 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, ఆయా వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తుంది. చేనేత సహకార సంఘాలకు గత చంద్రబాబు ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.103 కోట్లు చెల్లించేందుకు ఆప్కోకు జగన్ సర్కార్ నిధులు విడుదల చేసింది.

నేను విన్నాను, నేను ఉన్నాను అన్న మాటను అక్షరాలా నిజం చేస్తూ కరోనా కష్ట కాలంలోనూ ప్రతి కుటుంబానికి అండగా నిలబడుతూ సిఎం వైఎస్‌.జగన్‌ సంక్షేమ పథకాల జోరును కొనసాగిస్తున్నారు. వెనుకబడిన వర్గాలలో కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న నేతన్నల సంక్షేమం కోసం వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పేరుతో ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

సొంత మగ్గమున్న చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. నేడు సిఎం వైఎస్.జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఆన్‌ లైన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంలో మొత్తం 81,024 మంది లబ్ధిదార్లకు రూ. 194.46 కోట్ల ఆర్ధిక సాయం 6 నెలలు ముందుగానే అందనుంది. ఈ డబ్బును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.

పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా బ్యాంకులతో మాట్లాడి అన్‌ఇన్‌కంబర్డ్‌ అకౌంట్లకు ఈ నగదు జమ చేయనున్నారు. పారదర్శక విధానంలో సర్వే, గ్రామసభ, శాశ్వత సామాజిక తనిఖీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేయడంతో పాటు శాశ్వత ప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించారు.

ఇంకా ఎవరైనా ఈ పథకానికి అర్హత ఉండి జాబితాలో పేరు లేకపోతే గ్రామ సచివాలయానికి వెళ్లి అర్హతలు చూపించి, తగు ధృపత్రాలతో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించింది. వాటిని పరిశీలించి వచ్చే నెలలో ఆర్ధిక సాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

మరోవైపు చేనేత సహకార సంఘాలకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.103 కోట్లు చెల్లించేందుకు కూడా ప్రభుత్వం ఆప్కోకు నిధులు విడుదల చేసింది. కరోనా కష్టకాలంలోనూ పేద కుటుంబాలకు అండగా నిలబడిన ప్రభుత్వం, కరోనా వైరస్‌ నివారణలో భాగంగా మాస్కుల తయారీకై ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాల నుంచి సేకరించిన వస్త్రాలకు రూ.109 కోట్లు విడుదల చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి