iDreamPost

తన కొడుకు పెళ్లికి CM జగన్‌ను ఆహ్వానించిన YS షర్మిల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యంత్రి జగన్ మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. తన కొడుకు రాజారెడ్డి వివాహానికి రావాల్సిందిగా కోరుతూ అన్నావదినలకు షర్మిల పెళ్లి పత్రికను అందించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యంత్రి జగన్ మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. తన కొడుకు రాజారెడ్డి వివాహానికి రావాల్సిందిగా కోరుతూ అన్నావదినలకు షర్మిల పెళ్లి పత్రికను అందించారు.

తన కొడుకు పెళ్లికి CM జగన్‌ను ఆహ్వానించిన YS షర్మిల

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. వచ్చే నెల 17న వైఎస్ రాజారెడ్డి, ప్రియా అట్లూరి మూడు ముళ్ల బంధంతో ఒక్కటవబోతున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లికి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో షర్మిల తన కొడుకు పెళ్లికి పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పలుకుతోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ ను కూడా త్వరలో కలిసి ఆహ్వాన పత్రికను అందించనుందని జోరుగా ప్రచారం సాగింది. చాలా కాలం తర్వాత అన్నా, చెల్లెలు కలుసుకోనుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలోనే షర్మిల నేడు తన అన్న, వదినలను పెళ్లికి ఆహ్వానించేందుకు తాడేపల్లికి చేరుకుంది. సీఎం జగన్, భారతీలకు వివాహ ఆహ్వాన పత్రికను అందించింది. భర్త అనిల్ కొడుకు రాజారెడ్డి ఇతర కుటుంబ సభ్యులు అందరు తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకుని వివాహానికి ఆహ్వానించారు. దాదాపు మూడేళ్ల తర్వాత సీఎం జగన్ ను షర్మిల కలవడంతో అక్కడ అంతా సందడి వాతావరణం నెలకొంది. జగన్, షర్మిల కలవడంపై మరో వైపు రాజకీయపరంగా కూడా చర్చలు ఊపందుకున్నాయి. కానీ వీరి భేటీలో రాజకీయపరమైన అంశాలకు తావు లేకుండా కేవలం కుటుంబ విషయాలు చర్చించుకున్నట్లుగానే తెలుస్తోంది.

రాజారెడ్డి తను ప్రేమించిన ప్రియా అట్లూరి అనే యువతిని వివాహం చేసుకోబోతున్నారు. జనవరి 18న నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న వివాహం జరగనున్నాయి. ఈ మేరకు షర్మిల తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పటికే షర్మిల తన కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియాతో కలిసి మంగళవారం (జనవరి 2) ఇడుపులపాయను సందర్శించారు. వైఎస్సార్ సమాధి వద్ద కుమారుడి వివాహ మొదటి పత్రికను ఉంచి, ప్రార్థనలు చేశారు. కాబోయే వధూవరులు ఇద్దరూ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదాలు తీసుకున్నట్లు తెలిపారు షర్మిల. మరి షర్మిల తన అన్న సీఎం జగన్ ను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి