iDreamPost

Hyderabadలో దారుణం.. అక్క కోసం ఆ పని చేస్తూ..

  • Published Jun 15, 2024 | 9:50 AMUpdated Jun 15, 2024 | 9:50 AM

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. అక్క కోసం వెళ్లిన ఓ చెల్లికి దారుణ సంఘటన ఎదురయ్యింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఆ వివరాలు..

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. అక్క కోసం వెళ్లిన ఓ చెల్లికి దారుణ సంఘటన ఎదురయ్యింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఆ వివరాలు..

  • Published Jun 15, 2024 | 9:50 AMUpdated Jun 15, 2024 | 9:50 AM
Hyderabadలో దారుణం.. అక్క కోసం ఆ పని చేస్తూ..

అక్కాచెల్లెళ్ల మధ్య అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. పుట్టిన దగ్గర నుంచి కలిసే ఉంటారు. పెళ్లైన తర్వాత కూడా వారి మధ్య బంధం అలానే కొనసాగుతుంది. కలుసుకోవడం, మాట్లాడుకోవడం తగ్గుతుందేమో కానీ.. ప్రేమ మాత్రం అలానే ఉంటుంది. ఇక పెళ్లైన మహిళకు సమస్య వస్తే.. వెంటనే తోబుట్టువులే గుర్తుకు వస్తారు. మనసులోని బాధను వారితో పంచుకుని భారం తగ్గించుకుంటుంది. ఇక అక్కాచెల్లెళ్లు ఒకరి కోసం ఒకరు ఎన్ని త్యాగాలైనా చేసుకుంటారు. బతికినంత కాలం కలిసే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా కలిసే చేస్తారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అక్కాచెల్లెళ్లు కూడా ఇలానే అన్యోన్యంగా ఉండే వారు. వీరి మధ్య ప్రేమ చూసి ఎవరి కన్ను కుట్టిందో తెలియదు కానీ.. దారుణం చోటు చేసుకుంది. అక్క కోసం వెళ్లిన చెల్లికి ఏం అయ్యిందంటే..

అక్క కోసం వెళ్లిన ఓ చెల్లి అనుకోని రీతిలో మృతి చెందింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. అక్క కోసం కదులుతున్న బస్సు దిగిన చెల్లెలు ప్రమాదవశాత్తూ అదే బస్సు చక్రాల కింద నలిగి మృత్యువాత పడిన ఘటన మధురానగర్‌ పీఎస్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మసీరా మెహ్రీన్‌(16) యూసుఫ్‌గూడలోని మాస్టర్స్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతుండగా, ఆమె సోదరి జవేరియా మెహెక్‌ సెకండియర్‌ చదువుతోంది.

మధ్యాహ్నం కాలేజీ అయిపోయాక.. అక్కాచెల్లెళ్లు ఇంటికి వెళ్లడానికి యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌ వద్ద ఎదురు చూస్తు ఉన్నారు. సికింద్రాబాద్‌ నుంచి బోరబండ వెళ్తున్న బస్సు రాగానే రద్దీ ఎక్కువగా ఉండటంతో ముందుగా మెహ్రీన్‌ బస్సు ఎక్కింది. మెహెక్‌ మాత్రం ఫుట్‌ బోర్డు వరకు ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో బస్సు ఎక్కలేక రోడ్డు మీదనే నిలబడిపోయింది. అక్క బస్సు ఎక్కలేదని గమనించిన మెహ్రీన్‌.. తాను బస్సు దిగేందుకు ముందుకు వచ్చింది. కానీ ఇంతలో బస్సు బయలుదేరిదింది.

అక్క బస్సు ఎక్కలేదన్న కంగారులో.. మెహ్రీన్‌ కదులుతున్న బస్సులో నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కింద పడి నలిగి మృతి చెందింది. అక్క మెహెక్‌తో పాటు ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు సైతం విలవిలలాడిపోయారు. ఇటీవల పదో తరగతి పూర్తి చేసుకున్న మెహ్రీన్‌ వారం కిందటే కాలేజీలో చేరింది. మధురానగర్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుసూధన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో మెహ్రీన్‌  కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి