iDreamPost

Vizag: వీడియో: ఇంత బరితెగించారేంటి.. నడి రోడ్డు మీద ఇలాంటివి అవసరమా!

  • Published Jun 15, 2024 | 12:26 PMUpdated Jun 15, 2024 | 12:26 PM

నేటి కాలంలో కొందరు యువతీయువకులు చేస్తోన్న పనులు చూస్తే.. వీళ్లు మనుషులేనా అన్న అనుమానం రాక మానదు. నడి రోడుడపై బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

నేటి కాలంలో కొందరు యువతీయువకులు చేస్తోన్న పనులు చూస్తే.. వీళ్లు మనుషులేనా అన్న అనుమానం రాక మానదు. నడి రోడుడపై బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

  • Published Jun 15, 2024 | 12:26 PMUpdated Jun 15, 2024 | 12:26 PM
Vizag: వీడియో: ఇంత బరితెగించారేంటి.. నడి రోడ్డు మీద ఇలాంటివి అవసరమా!

నేటి కాలంలో కొందరు యువతీయువకుల తీరు చూస్తే.. వారికి వెర్రో, పిచ్చో అర్థం కాదు. ఇక కొందరు వేసే వేషాలు చూస్తే.. అసలు మనం మనుషుల మధ్యే ఉన్నామా అనే డౌట్‌ రాక మానదు. కనీసం నలుగురు చూస్తున్నారు.. వారు ఏం అనుకుంటారు అనే ధ్యాస కూడా లేకుండా.. నడి రోడ్డు మీద బరి తెగించి పిచ్చి వేషాలు వేస్తున్నారు. మరి యువతలో ఇలాంటి విపరీత బుద్దులు ఎందుకు పుట్టుకు వస్తున్నాయి అంటే.. సోషల్‌ మీడియా పైత్యం. అవును సోషల్‌ మీడియా వినియోగం పెరిగిన తర్వాతే.. ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తున్నాయి. వ్యూస్‌, కామెంట్స్‌ కోసం.. రాత్రికి రాత్రి వైరల్‌ అవ్వడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు యువత. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ల మీద విన్యాసాలు చేస్తున్నారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా వారిలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ క్రమంలో తాజాగా సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అయ్యింది. ఆ వివరాలు..

నేటి కాలంలో యువతకు ఫొటో షూట్‌ల పిచ్చి పెరిగిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఫొటోలకు ఫోజులు ఇస్తూ సరదా తీర్చుకుంటున్నారు. ఇది వారికి బాగానే ఉండవచ్చు.. కానీ వీరు చేసే పిచ్చి పనుల వల్ల మిగతా వాళ్లు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇక తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. రద్దీగా ఉండే రోడ్డులో.. ఒ యువతి ఫొటో షూట్‌ చేయించకుంది. ఆమెకు ఇరు పక్కల నుంచి వాహనాలు వెళ్లిపోతున్నాయి. కానీ యువతి మాత్రం దాన్ని పట్టించుకోకుండా.. ఏమాత్రం భయం లేకుండా నడి రోడ్డు మీద నిలబడి ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. పెళ్లి కుమార్తెలా తయారై ఫొటోలు దిగింది. ఇక ఫొటో గ్రాఫర్‌ కూడా ఆమెని వారించకపోగా.. ఉత్సాహపరుస్తూ ఫొటోలు తీశాడు. ఈ సంఘటన వైజాగ్‌ ఆర్టీసీ, అండర్‌ పాస్‌ రోడ్డులో వెలుగు చూసింది.

యువతి చేస్తోన్న నిర్వాహకం గమనించి.. అటుగా వెళ్తోన్న వాహనాదారులు దీన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీకు కొంచెమైనా బుద్ధి ఉందా.. పట్టపగలు నడి రోడ్డు మీద ఇవేం పనులు.. మీకెమన్నా అయితే.. ఎవరిది బాధ్యత.. మీవల్ల మిగతావారికి ఎంత ఇబ్బందో ఆలోచించరా.. మరి ఇంత దిగజారి ప్రవర్తించాలా.. ఛీ మీరు అసలు మనుషులేనా అని ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వైజాగ్‌ సిటీ పోలీసులను కోరుతూ.. ట్విట్టర్‌లో ట్యాగ్‌ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి