iDreamPost

వీడియో: నువ్వు దేవుడివి సామి.. దివ్యాంగుడికి స్నానం చేయించి.. వ్యాపారం పెట్టించి..

జన్మనిచ్చిన అమ్మా, నాన్నలకే సేవ చేయని కొడుకులున్న సమాజంలో ఉన్నాం. అలాంటిది ఎవరూ లేని అనాథకు అమ్మ, నాన్న అయ్యి ఒక దారి చూపించాడో యువకుడు. ఆ దివ్యాంగుడి పాలిట దేవుడయ్యాడు.

జన్మనిచ్చిన అమ్మా, నాన్నలకే సేవ చేయని కొడుకులున్న సమాజంలో ఉన్నాం. అలాంటిది ఎవరూ లేని అనాథకు అమ్మ, నాన్న అయ్యి ఒక దారి చూపించాడో యువకుడు. ఆ దివ్యాంగుడి పాలిట దేవుడయ్యాడు.

వీడియో: నువ్వు దేవుడివి సామి.. దివ్యాంగుడికి స్నానం చేయించి.. వ్యాపారం పెట్టించి..

ధర్మం ఒంటి కాలు మీద నడుస్తున్న ఈ కలియుగంలో భూమి ఇంకా అంతం కాకుండా ఉన్నదంటే అది మంచి మనుషుల వల్లే.. వారి మంచి మనసుల వల్లే. ఆ ఒక్క మంచే.. చెడు మూడు పాదాల మీద ఉన్నప్పటికీ ఈ భూమిని కాపాడుతుంది. ఎవరికైనా ఆపద వచ్చినా.. అవసరం వచ్చిన సహాయం చేయకుండా ఉండలేరు. తాజాగా ఓ యువకుడు ఓ నిరాశ్రయుడైన దివ్యాంగుడికి గొప్ప మనసుతో సహాయం చేశాడు. ఎలాంటి ఆధారం లేని ఆ వ్యక్తితో ఏకంగా వ్యాపారమే పెట్టించాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఎవరైనా రోడ్డు మీద బిచ్చగాళ్ళు కనిపిస్తే ఎంతో కొంత ఇచ్చి వెళ్ళిపోతారు. లేదంటే తినడానికి ఏదైనా ఇస్తారు. కానీ ఓ యువకుడు ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. కాళ్ళు సరిగా లేని ఓ దివ్యాంగుడు రోడ్డు మీద చేతుల సహాయంతో పాకుతూ వెళ్తున్నాడు. అతని వెనకాలే వెళ్లిన యువకుడు.. అతని కాళ్లకు దండం పెట్టుకుని ఎత్తుకుని రోడ్డు పక్కకు తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు. మాసిన గడ్డంతో ఉన్న ఆ దివ్యాంగుడికి చక్కగా ట్రిమ్మింగ్ చేయించి.. శుభ్రంగా తల స్నానం చేయించాడు. అనంతరం కొత్త బట్టలు వేశాడు. అతని కళ్ళకు గంతలు కట్టి సర్ప్రైజ్ చేశాడు. కళ్ళు తెరిచి చూస్తే అతని ఎదురుగా ఒక వీల్ చైర్ సైకిల్ ఉంది. అందులో స్నాక్స్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ఉన్నాయి.

అతనితో ఒక మొబైల్ దుకాణాన్ని పెట్టించాడు. కొబ్బరికాయ కొట్టి, హారతి ఇచ్చి మరలా కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వచనాలు తీసుకున్నాడు. నిజానికి అమ్మ ఉంటే స్నానం చేయించేది.. బట్టలు వేసేది. ఎత్తుకుని అన్నం తినిపించేది. నాన్న ఉంటే.. ఆ నాన్నకి డబ్బు ఉంటే బిడ్డ కోసం వ్యాపారం పెట్టిస్తాడు. అయితే ఆ దివ్యాంగుడికి అమ్మ, నాన్న అయ్యి అన్నీ తానే చేశాడు. చేయి చాచి అడుక్కునే పరిస్థితి లేకుండా తనకు తానుగా సంపాదించుకునేలా చేశాడు. ఆ యువకుడు చేసిన పనికి అందరూ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కాగా నెటిజన్స్ ఈ వీడియో చూసి సంతోషంగా ఉందని.. కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కొంతమంది మాత్రం నడిరోడ్డు మీద స్నానం చేయించడమేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి సరికాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాల్లే.. మీరు ఎలాగూ మంచి చేయరు.. చేసేవాళ్ళని చేయనివ్వరా అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎవరెలా పోతే నాకేంటి అనుకునే ఈరోజుల్లో.. దివ్యాంగుడికి స్నానం చేయించి.. బట్టలు వేసి.. వ్యాపారం పెట్టించి లైఫ్ ఇచ్చిన యువకుడిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి