iDreamPost

నిమిషాల్లో 50 వేలు ఇస్తున్న బ్యాంక్.. ఎలా పొందొచ్చంటే?

మీకు అర్జంటుగా డబ్బు అవసరం వచ్చిందా? ఎక్కడా అప్పు దొరకడం లేదా? అయితే ప్రముఖ బ్యాంక్ నిమిషాల్లోనే 50 వేల లోన్ అందిస్తున్నది. ఏ షూరిటీ లేకుండానే పొందొచ్చు.

మీకు అర్జంటుగా డబ్బు అవసరం వచ్చిందా? ఎక్కడా అప్పు దొరకడం లేదా? అయితే ప్రముఖ బ్యాంక్ నిమిషాల్లోనే 50 వేల లోన్ అందిస్తున్నది. ఏ షూరిటీ లేకుండానే పొందొచ్చు.

నిమిషాల్లో 50 వేలు ఇస్తున్న బ్యాంక్.. ఎలా పొందొచ్చంటే?

డబ్బు అవసరం ఎప్పటికీ ఉంటుంది. నేడు ఏ పని జరగాలన్నా, గౌరవ మర్యాదలు దక్కాలన్నా డబ్బే కీలక పాత్ర పోషిస్తున్నది. అయితే కొన్ని సార్లు హఠాత్తుగా మనీ అవసరం అవుతుంది. ఆ సమయంలో చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. అంత తొందరగా అప్పు కూడా దొరకడం కష్టం. అలాగని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, లోన్ యాప్స్ వంటి వాటిల్లో రుణం పొందాలంటే షూరిటీ, డాక్యూమెంట్స్ అవసరం అవుతాయి. అంతేకాదు లోన్ మంజూరుకు సమయం కూడా ఎక్కువగా పడుతూ ఉంటుంది. మరి ఇలాంటి సమయాల్లో నిమిషాల్లోనే ఏ షూరిటీ లేకుండా డబ్బు చేతికి అందితే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి ప్రముఖ బ్యాంక్ గుడ్ న్యూస్ అందించింది. నిమిషాల వ్యవధిలోనే షూరిటీ లేకుండా 50 వేల లోన్ అందిస్తున్నది.

మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే మీ చేతిలో ఉన్న డబ్బు సరిపోకవ పోవచ్చు. ఇలాంటి సమయాల్లో బ్యాంకుల్లో లోన్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. సిబల్ స్కోర్, డాక్యూమెంట్స్ ఇతర వివరాలను సరిచూసుకున్నాక బ్యాంకులు లోన్స్ మంజూరు చేస్తుంటాయి. అయితే ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షూరిటీ లేకుండానే లోన్ ఇస్తోంది. ఎస్బీఐ శిశు ముద్రా లోన్ స్కీమ్ ద్వారా రుణాన్ని అందిస్తున్నది. ఇందులో మీకు రూ.50,000 లోన్ లభిస్తుంది. రుణగ్రహీత 5 సంవత్సరాల్లో లోన్ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణంపై సంవత్సరానికి 12% వడ్డీ వేస్తారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికీ లేదా తమ వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకునే వారికి మాత్రమే ఈ రుణం లభిస్తుంది.

ఈ పథకం ద్వారా లోన్ పొందేందుకు సమీప ఎస్బీఐ బ్రాంచ్ కు వెళ్లి పూర్తి వివారాలు తెలుసుకుని అప్లై చేసుకోవచ్చు. ఎస్బీఐ శిశు ముద్ర స్కీమ్ ద్వారా లోన్ పొందేందుకు వయసు 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, క్రెడిట్ కార్డ్ రిపోర్ట్, బిజినెస్ సర్టిఫికెట్, మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ కలిగి ఉండాలి. ఈ స్కీమ్ ద్వారా లోన్ పొందేందుకు ఎస్బీఐ బ్యాంక్ కు వెళ్లి అప్లికేషన్ ఫారంని పూరించి అవసరమైన పత్రాలను అందించిన తర్వాత బ్యాంక్ అధికారులు తనిఖీ చేసి రుణాన్ని మంజూరు చేస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి