iDreamPost

పవన్ కల్యాణ్ దత్తపుత్రుడే కాదు విషపుత్రుడు కూడా : వాసిరెడ్డి పద్మ

  • Author singhj Published - 06:21 PM, Thu - 27 July 23
  • Author singhj Published - 06:21 PM, Thu - 27 July 23
పవన్ కల్యాణ్ దత్తపుత్రుడే కాదు విషపుత్రుడు కూడా : వాసిరెడ్డి పద్మ

ఆంధ్రప్రదేశ్ లోని​ వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై​ రేగిన దుమారం ఇంకా తగ్గడం లేదు. ఆయన కామెంట్స్ పై సీరియస్ అయిన వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేశారు. నిరసనలే కాదు.. ఈ విషయంలో పవన్​పై వాలంటీర్లు కేసు పెట్టేదాకా వెళ్లింది. అయితే వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యల్ని ఇప్పటికే పలుమార్లు తప్పుబట్టారు ఏపీ మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ. తాజాగా మరోసారి జనసేన అధినేతపై ఆమె మండిపడ్డారు. మహిళల సమక్షంలో పవన్ రచ్చబండకు రావాలని ఆమె ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్​ కేవలం దత్తపుత్రుడే కాదని విషపుత్రుడంటూ వాసిరెడ్డి పద్మ ఘాటుగా విమర్శలు చేశారు.

మహిళల అదృశ్యం విషయంపై రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఒక ప్రకటన చేశారని వాసిరెడ్డి పద్మ గుర్తుచేశారు. ఆ ప్రకటన ప్రకారం.. మహిళల అదృశ్యంలో  దేశంలో ఏపీ 11వ స్థానంలో ఉందన్నారామె. అయితే పవన్ కల్యాణ్​ మాత్రం ఈ విషయాన్ని ప్రస్తావించడం లేదని ఆమె సీరియస్ అయ్యారు. రాజ్యసభ ఎందుకు ఏపీలో మహిళల అదృశ్యం పైనే ఎక్కువ ఆందోళన చెందుతోందని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. పవన్ కూడా ఒక్క ఏపీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రేమ వ్యవహారాల వల్లే చాలా మంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రేమ వ్యవహారాల వల్లే అమ్మాయిలు మిస్సవుతున్నారని చెప్పిన వాసిరెడ్డి పద్మ.. ఈ ప్రేమలకు సినిమాలు ఒక కారణం కాదా? అని ప్రశ్నించారు. తప్పిపోయిన వారిలో 78 శాతం అమ్మాయిలు వెనక్కి వస్తున్నారనే విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదని  ప్రశ్నించారు.  చీరలు పంచుతామని పిలిచి చావులకు కారణమయ్యారని పరోక్షంగా టీడీపీపై ఆమె ఫైర్ అయ్యారు. మహిళలకు మీరు, మీ పార్ట్​నర్ ఇచ్చే గౌవరం ఇదంటూ చంద్రబాబు, పవన్​పై వాసిరెడ్డి పద్మ విమర్శలు గుప్పించారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం అమ్మాయిల మిస్సింగ్ కేసుల్లో ఆరో స్థానంలో ఉంటే జనసేనాని ఎందుకు నోరు విప్పడం లేదని ఆమె నిలదీశారు. మహిళా కమిషన్​కు రాజకీయ దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారని.. ఇది సరికాదని వాసిరెడ్డి పద్మ సీరియస్ అయ్యారు. మరి.. పవన్ పై వాసిరెడ్డి పద్మ  చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి