iDreamPost

శివరాం వేధింపులతో తమ బిడ్డ ఆత్మహత్య.. కన్నీరు పెట్టుకున్న మహిళ!

kodela sivaram: శివరాం వేధింపులు భరించలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ  గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామానికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

kodela sivaram: శివరాం వేధింపులు భరించలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ  గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామానికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

శివరాం వేధింపులతో తమ బిడ్డ ఆత్మహత్య.. కన్నీరు పెట్టుకున్న మహిళ!

కోడెల శివరాం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తనయడే  శివారం. పల్నాడు జిల్లాలో ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని గతంలో శివరాం అనేక అక్రమాలకు పాల్పడ్డాడని స్థానికంగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక డబ్బుల కోసం వేధింపులకు గురి చేసేవాడని నరసరావు పేట, సత్తెనపల్లి ప్రాంత ప్రజలు చెబుతుంటారు. తాజాగా ఓ మహిళ కూడా కోడెల శివరామ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. శివరాం వేధింపులు భరించలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడంటూ  గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామానికి చెందిన ఓ మహిళ భోరున విలపిస్తున్నారు.

ప్రముఖ మీడియా సంస్థ సాక్షి వెబ్ సైట్ లో వచ్చిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన కొల్లేజు ఫణీంద్రసాయి(22) నాలుగేళ్ల క్రితం  గుంటూరు నాజ్ సెంటర్ లోని డీమార్ట్ లో గేట్ ఇన్ ఛార్జీగా పనిలో చేరాడు. అతి తక్కువ సమయంలోనే సూపర్ వైజర్ గా ఫణీంద్ర సాయి ఎదిగాడు.  ఈ ఉద్యోగంతో పాటు కోడెల శివరాం సంబంధించిన వ్యక్తిగత పనులు కూడా అతడే చూస్తుండేవాడు. నగదు సంబంధించిన లావాదేవీలతో పాటు గుంటూరు, విజయవాడలోని పలు ప్రాంతాల్లో వీరికి చెందిన కన్ స్ట్రక్షన్ లకు చెందినవి కూడా చూస్తుంటాడు. కొంతకాలం క్రితం ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఫోన్ స్విచ్ఛాప్ చేసి రెస్ట్ తీసుకుంటున్న సమయంలో కంపెనీకి సంబంధించిన డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో డీమార్ట్ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.

ఆరోగ్యం కుదుట పడిన తరువా ఫణీంద్ర సాయి వచ్చి రూ.2 లక్షలను తిరిగి ఇచ్చారని తోటి ఉద్యోగులు తెలిపారు.  ఈ నెల ప్రారంభంలో మరోసారి అనారోగ్యానికి గురయ్యాడు దీంతో చికిత్స పొంది..ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు.  ఈ నేపథ్యంలోనే కోడెల శివరాం అనుచరుడైన నాయక్ నాలుగు రోజులుగా ఇంటికి వచ్చి. తమ బిడ్డను  భయభ్రాంతులకు  గురిచేయడం ప్రారంభించారని బాధితుడి తల్లి తెలిపారు. ఈ క్రమంలోనే ఫణీంద్ర గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కోడెల శివరాం, ఆయన అనుచరుడు నాయక్ లు అకారణంగా వేధింపులకు గురి చేయడంతోనే తమ బిడ్డ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి నాగమణి ఆరోపిస్తున్నారు.  తన కుమారుడి మృతికి కారణమైన కోడెల శివరాం, అతని అనుచరుడు నాయక్ లపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి