iDreamPost

ఖర్చులతో భర్తను హింసిస్తున్న భార్య.. వారంలో అన్ని కోట్ల ఖర్చు!

ఖర్చులతో భర్తను హింసిస్తున్న భార్య.. వారంలో అన్ని కోట్ల ఖర్చు!

 ఓ భార్య తన భర్తను ఖర్చులతో హింసిస్తోంది. అతడు కోటీశ్వరుడైనా.. అతడికున్న కోట్లను హారతి కర్పూరంలా హరిస్తోంది. వారంలో ఏకంగా 17 కోట్ల ఖర్చు పెట్టేసింది. చాక్లెట్ల కోసం కొంత, బంగారం కోసం కొంత.. ఇతర సరదాల కోసం మిగిలిన డబ్బు ఖర్చు చేసింది. తన ఎంజాయ్‌మెంట్‌కు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ వస్తోంది. వివరాల్లోకి వెళితే.. లిండా ఆడ్రేడ్‌ అనే మహిళ కొన్ని ఏళ్ల క్రితం దుబాయ్‌కి చెందిన ఓ కోటీశ్వరుడ్ని పెళ్లి చేసుకుంది. అతడి పేరు రిక్కీ ఆడ్రిడ్‌. రిక్కీతో లిండా పెళ్లయ్యే సమయానికి ఆమె వయసు 19 ఏళ్లు మాత్రమే. ఇక, భర్తతో పెళ్లయిన నాటి నుంచి అతడి డబ్బులు విచ్చల విడిగా ఖర్చు చేస్తోంది.

నెలకు కోట్లలో ఖర్చు చేస్తోంది. ఓ సారి వారంలో ఏకంగా 17 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ విషయాలను కూడా ఆమే స్వయంగా తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేస్తూ వచ్చింది. లిండా అలా విచ్చల విడిగా భర్త డబ్బులు ఖర్చు పెట్టడాన్ని కొందరు నెటిజన్లు తప్పుబడుతున్నారు. డబ్బుకోసమే ఆమెను పెళ్లి చేసుకుందంటూ మండిపడుతున్నారు. అయితే, తన అందం కోసమే పెళ్లి చేసుకున్న అతడి డబ్బు ఖర్చు చేయటంలో తనకు ఎలాంటి సిగ్గు లేదని అంటోంది. మరి, వారం రోజుల్లో 17 కోట్ల రూపాయల భర్త డబ్బును ఖర్చు పెట్టిన లిండాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Linda Andrade (@lionlindaa)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి